ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై షాకింగ్ అప్‌‌డేట్..

.ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో చిత్ర నిర్మాతలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: June 28, 2020, 2:05 PM IST
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై షాకింగ్ అప్‌‌డేట్..
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా  మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ .. బిజినెస్ మ్యాన్ నుంచి రాజకీయ నాయకుడి ఎందుకు మారాడనే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అసలు ఒక వ్యాపారవేత్త ఎందుకు పొలిటిషన్ కావాల్సి వచ్చిందో ఈసినిమా స్టోరీ.

jt ntr director trivikram latest movie copy of chiranjeevi super hit movie,ntr trivikram chiranjeevi,NTR,ntr 30,ntr trivikram Mantri Gari Viyyankudu chiranjeevi,Mantri Gari Viyyankudu chiranjeevi ntr trivikram,trivikram ntr movie copy from Mantri Gari Viyyankudu,ntr trivikram political backdrop movie,Jr ntr balakrishna trivikram,jr ntr rashmika pooja hegde trivikram,ntr,jr ntr,rrr,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ayinanu poyiravale hasthinaku,ntr trivikram ayinanu poyiravale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్,రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా,పూజా హెగ్డే,రష్మిక మందన్న,మంత్రిగారి వియ్యంకుడు,మంత్రిగారి వియ్యంకుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్,చిరంజీవి మంత్రిగారి వియ్యంకుడు సినిమా రీమేక్ ఎన్టీఆర్,త్రివిక్రమ్
ఎన్టీఆర్ త్రివిక్రమ్ Photo : Twitter


ఐతే.. కరోనా కారణంగా ఈ సినిమా బడ్జెట్‌లో భారీ కోత విధించినట్టు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్‌తో పాటు త్రివిక్రమ్ తమ పారితోషకంలో 30 శాతానికి పైగా తగ్గించుకున్నట్టు సమాచారం. మరోవైపు ఒకప్పటిలా థియేటర్స్‌లో వందల కోట్టు వచ్చే అవకాశాలు లేవు. మరోవైపు భారీ సినిమాలకు పెద్ద సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అయిన అమెరికాతో పాటు మిగతా దేశాలు కరోనాతో అల్లాడుతున్నాయి. పైగా విదేశాల్లో ఉన్న చాలా మంది భారతీయులు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పట్లో పెద్ద సినిమాలు ఎంత వసూలు చేస్తాయనేది చెప్పడం కష్టం.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


మరోవైపు ఇతర టెక్నీషియన్స్‌కు ఇచ్చే బడ్జెట్‌లో కూడా భారీ కోతలు మొదలయ్యాయి. ఇంకోవైపు ఇది వరకటిలా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు పలకడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ  సినిమా బడ్జెట్‌ను సగానికి సగం తగ్గించి తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర నిర్మాతలు. ఒకవేళ అంతా బాగుంటే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరాకు ప్రారంభించి సమ్మర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒక హీరోయిన్‌గా నభా నటేష్ అనుకుంటున్నారు. మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డే లేదా రష్మికను అనుకుంటున్నారు.
First published: June 28, 2020, 2:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading