Jr NTR Poasni Krishna Murali: హీరో కాకముందు జూనియర్ ఎన్టీఆర్‌ను అనాథలా చూసారు.. చంద్రబాబుపై పోసాని సంచలనం..

జూనియర్ ఎన్టీఆర్(jr ntr)

Jr NTR Poasni Krishna Murali: ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. తాజాగా వైసిపీ నేత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి మీడియా ముందుకొచ్చాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

  • Share this:
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. తాజాగా వైసిపీ నేత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి మీడియా ముందుకొచ్చాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అలాగే ఆయన వ్యక్తిత్వంపై కూడా కామెంట్ చేసాడు. మధ్యలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ కూడా తీసుకొచ్చాడు. చంద్రబాబు అందర్నీ అవసరానికి మాత్రమే వాడుకుంటాడని.. అవసరం తీరిపోయాక విసిరి పారేస్తాడని తెలిపాడు పోసాని. పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే జరిగిందని ఆయన చెప్పుకొచ్చాడు. 2014 ఎన్నికల సమయంలో పవన్ రెక్కలు ముక్కలు చేసుకుని తెలుగుదేశం పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. అప్పుడు ఆయన్ని స్టేజీపై కూర్చోబెట్టుకున్నారు. పవన్ గురించి చంద్రబాబు ఆకాశానికి ఎత్తేసాడని చెప్పాడు. ఆ సమయంలో ముందు సీట్స్‌లో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూర్చున్నారని గుర్తు చేసాడు. అదే పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికలకు ముందు లోకేష్ గురించి కామెంట్ చేసేసరికి తెలుగుదేశం నాయకులు అంతా ఆయనపై సీరియస్ అయ్యారని.. మండిపడ్డారని చెప్పాడు పోసాని. లోకేష్ నువ్వు ఇంకెంత సంపాదించుకుంటావయ్యా.. పైనున్న మీ తాత కూడా సంతోషంగా లేడు నిన్ను చూసి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు కోపగించుకున్నారని చెప్పాడు పోసాని. అంటే చంద్రబాబును పొగిడినపుడు బాగుంటారు.. తప్పులు ఎత్తి చూపిస్తే మాత్రం రివర్స్ అవుతారు.. అదే చంద్రబాబు మెంటాలిటీ అంటూ ఈయన తీవ్రంగా మండి పడ్డాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే చేసారని చెప్పుకొచ్చాడు.
jr ntr,jr ntr twitter,jr ntr politics,jr ntr posani krishna murali,jr ntr chandrababu naidu,jr ntr balakrishna,jr ntr tdp,jr ntr posani comments,telugu cinema,పోసాని కృష్ణమురళి,జూనియర్ ఎన్టీఆర్ పోసాని కృష్ణమురళి,తెలుగు సినిమా,హీరో కాకముందు ఎన్టీఆర్‌ను అనాథలా చూసారంటున్న పోసాని
చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

వాళ్ళ తాతలా మంచి వాగ్ధాటి కలిగిన లీడర్ కాబట్టి అప్పుడు ఖాకీ వేసుకుని రాష్ట్రమంతా పార్టీ ప్రచారం చేసాడు. అప్పుడు అవసరం అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కరివేపాకులా మారిపోయాడు అంటూ గుర్తు చేసాడు పోసాని. ఎన్నికల సమయంలో కావాలి కానీ ఆ తర్వాత అవసరం లేదు.. అవసరం తీరిపోయిన తర్వాత తీసేసే గుణం బాబు దగ్గరే నేర్చుకోవాలంటున్నాడు ఈయన. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరో కాకముందు ఆయనతో ఎవరూ మాట్లాడలేదని.. ఒక్కరు కూడా పలకరించిన పాపాన పోలేదని చెప్పాడు. (Source: Daily Culture)

కానీ ఈ రోజు ఇండస్ట్రీలో టాప్ హీరో.. పైగా జనాన్ని రప్పించగల నాయకుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి అందరూ ఎన్టీఆర్ అంటూ వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇదే ఎన్టీఆర్‌ను అప్పట్లో చంద్రబాబుతో సహా అంతా ఓ అనాథలా చూసారని చెప్పాడు. తారక్‌కు ఏ మాత్రం రాజకీయ అనుభవం ఉన్నా కూడా తెలుగుదేశం వైపు రాడనే అనుకుంటున్నట్లు చెప్పాడు ఈయన. తనను వాడుకుని వదిలేసారని తెలిసిన తర్వాత ఆయనెందుకు వస్తాడంటూ ప్రశ్నించాడు పోసాని. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై తెలుగుదేశం నాయకుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: