హోమ్ /వార్తలు /సినిమా /

NTR- Nithin Chandra: 'చిత్రం 1.1'లో నితిన్.. బావమరిది సినిమాకు చీఫ్ గెస్ట్‌గా రానున్న ఎన్టీఆర్

NTR- Nithin Chandra: 'చిత్రం 1.1'లో నితిన్.. బావమరిది సినిమాకు చీఫ్ గెస్ట్‌గా రానున్న ఎన్టీఆర్

చిత్రం 1.1 ఎన్టీఆర్

చిత్రం 1.1 ఎన్టీఆర్

Chitram 1.1 Launch: దాదాపు 21 ఏళ్ల త‌రువాత చిత్రం సీక్వెల్ చిత్రం 1.1ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. అంతేకాదు ఈ మూవీని తేజనే నిర్మిస్తుండ‌గా.. ఆర్పీ ప‌ట్నాయ‌క్ చాలా సంవత్స‌రాల త‌రువాత మ్య‌జిక్‌ని అందిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Chitram 1.1 Launch: దాదాపు 21 ఏళ్ల త‌రువాత చిత్రం సీక్వెల్ చిత్రం 1.1ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. అంతేకాదు ఈ మూవీని తేజనే నిర్మిస్తుండ‌గా.. ఆర్పీ ప‌ట్నాయ‌క్ చాలా సంవత్స‌రాల త‌రువాత మ్య‌జిక్‌ని అందిస్తున్నారు. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఇందులో ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ చంద్ర హీరోగా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా తేజ ద‌గ్గ‌ర యాక్టింగ్ క్లాస్‌లు తీసుకున్న నితిన్.. ఈ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మం ఏప్రిల్ 18న హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌బోతుండ‌గా.. దానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నార‌ట‌. ఆయ‌న‌తో పాటు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు చిత్రం 1.1 మూవీ లాంచ్‌కు రాబోతున్నార‌ట‌.

  కాగా 2000 సంవ‌త్స‌రంలో ఉద‌య్ కిర‌ణ్‌, రీమాసేన్‌ల‌తో తేజ చిత్రం సినిమాను తెర‌కెక్కించారు. ఈ మూవీ ద్వారానే హీరోగా ఉద‌య్ కిర‌ణ్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు ఉద‌య్ కిర‌ణ్‌కు మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ను తీసుకొచ్చింది. ఇటీవ‌ల ఈ మూవీకి సీక్వెల్‌ని ప్ర‌క‌టించారు తేజ‌. ఇదిలా ఉంటే ఈ మూవీలో 40 మంది కొత్త వాళ్లు వివిధ పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

  అయితే కొత్త వారి నుంచి యాక్టింగ్‌ను రాబ‌ట్ట‌డం తేజ‌కు కొత్తేం కాదు. త‌న కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువ‌గా కొత్త వాళ్ల‌తోనే సినిమాల‌ను తీశారు తేజ‌. నితిన్, ఉద‌య్ కిర‌ణ్, కాజ‌ల్ అగ‌ర్వాల్, నందితా రాజ్, స‌దా, ప్రిన్స్ ఇలా చాలా మంది న‌టుల‌ను ఆయ‌న టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బావ‌మ‌రిదిని తేజ హీరోగా ఇంట్ర‌డ్యూజ్ చేయ‌బోతున్నాడు.

  ఇదిలా ఉంటే నితిన్ ఎంట్రీపై ఎప్ప‌టినుంచో వార్త‌లు వినిపిస్తూ వ‌స్తున్నాయి. టాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు నితిన్ చాలా ఆస‌క్తిని చూపుతున్నాడ‌ని.. కానీ ఈ విష‌యంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడ‌ని టాక్ న‌డిచింది. అయితే తేజ ద‌గ్గ‌ర యాక్టింగ్ నేర్చుకున్న త‌రువాత నితిన్ విష‌యంలో ఎన్టీఆర్ హ్యాపీగా ఫీల్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో బావ‌మ‌రిది స‌పోర్ట్‌ను ఇచ్చేందుకు సినిమా ప్రారంభం రోజు ఎన్టీఆర్ రాబోతున్నార‌ట‌.

  Published by:Manjula S
  First published:

  Tags: NTR

  ఉత్తమ కథలు