JR NTR THAT MEGA HERO IS NTR BIG FAN IN HIS NEXT FILM HERE ARE THE DETAILS TA
Jr NTR : ఎన్టీఆర్ వీరాభిమాని పాత్రలో మెగా హీరో.. ‘తారక్’ మంత్రంతో మాయ చేస్తాడా..
ఎన్టీఆర్ అభిమానిగా మెగాహీరో (File/Photo)
Jr NTR : ఎన్టీఆర్ వీరాభిమాని పాత్రలో మెగా హీరో నటిస్తున్నాడు. ఇంట్లో డజనుకు పైగా హీరోలుండగా .. మెగా హీరోలు వేరే హీరోలకు అభిమానులుగా నటించడం పెద్ద విశేషమనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే..
Jr NTR : ఎన్టీఆర్ వీరాభిమాని పాత్రలో మెగా హీరో నటిస్తున్నాడు. ఇంట్లో డజనుకు పైగా హీరోలుండగా .. మెగా హీరోలు వేరే హీరోలకు అభిమానులుగా నటించడం పెద్ద విశేషమనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. అది మెగా ఫ్యామిలీ హీరో ఎన్టీఆర్‌కు ఫ్యాన్‌గా నటించడం చెప్పుకొదగ్గ విశేషమే అనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ కొణిదెల ఇంటి నుంచి పవన్ తేజ్ కొణిదెల ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. చిరంజీవి ఇంటిపేరు ఉన్న ఈతనికి చిరు బాబాయి వరుస అవుతాడట. అయితే ఈ మెగా హీరోకు తొలి సినిమా ఫలితం పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఇపుడు చేస్తోన్న రెండో సినిమాలో పవన్ తేజ్.. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్‌గా కనిపిస్తుండటం గమనార్హం.
పవన్ తేజ్ తన బర్త్ డే సందర్భంగా పోస్టర్ విడుదల చేసారు. రెండో సినిమాతో పవన్ తేజ్ కొణిదెల హీరోగా సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.ఈ సినిమాకు టైటిల్
ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ సందర్భంగా పవన్ తేజ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పై అభిమానమే ఆయన ఫ్యాన్‌గా నటించేలా చేసిందంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో పవన్ తేజ్ తొలి సినిమాకు నాగబాబు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఎన్టీఆర్ అభిమాని పాత్రలో పవన్ తేజ్ కొణిదెల (File/Photo)
మెగా హీరోలతోపాటు నందమూరి ఫ్యాన్స్ల మద్దతు కూడా ఉంటే హీరోగా సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో పాత్ర ప్రకారం ఎన్టీఆర్ అభిమానిగా కనిపించబోతున్నట్టు చెప్పారు. ఈ సినిమాను ఎన్టీఆర్ టాకీస్ బ్యానర్ పై శ్రీనివాస్ శ్రీరపు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక వేరే సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న ‘థాంక్యూ’ సినిమాలో మహేష్ బాబు అభిమాని పాత్రలో కనిపించనున్నారు. ఇక నాని హీరోగా నటించిన ‘కృష్ణగారి వీరప్రేమగాథ’ సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటించిన సంగతి తెలిసిందే కదా.
మెగా హీరో పవన్ తేజ్ కొణిదెల (File/Photo)
అటు వేరే హీరోలు చిరు, పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసింద కదా. ఇపుడు మెగా కాంపౌండ్‌కు చెందిన హీరో పనవ్ తేజ్ కొణిదెల ... తన ఫ్యామిలీకి చెందిన ఎంతో మంది హీరోలుగా ఉండగా.. ఇపుడు రాబోయే సినిమాలో ఎన్టీఆర్ అభిమానిగా కనిపించబోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.