ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలేమీ లేవు కదా.. అలా ఎలా వాయిదా పడుతుంది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరిగింది మరి. అయితే ఇక్కడ ఎన్టీఆర్ సినిమా అంటే ఆయన నటించిన సినిమాకు రీమేక్ అంతే. జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘టెంపర్’ తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు కానీ ఎన్టీఆర్ కెరీర్ మాత్రం ఈ చిత్రం తర్వాత రయ్యిమంటూ పైకి లేచింది. వరస విజయాలతో దుమ్ము దులిపేస్తున్నాడు ఈ హీరో. ఇక ఈ చిత్రాన్ని వరసగా పలు భాషల్లో రీమేక్ చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే హిందీలో ఈ సినిమాను రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. అక్కడ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసింది సింబా. ఈ సినిమాలో సారా అలీ ఖాన్ హీరోయిన్గా నటించింది. యూనివర్సల్ కాన్సెప్ట్ నిర్భయ థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెరకెక్కిస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ మధ్యే విడుదలైన అయోగ్య టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను ముందు ఎప్రిల్ 19న విడుదల చేయాలని ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. తమిళ సంక్రాంతి కానుకగా ఆ రోజు తీసుకొస్తే బాగుంటుందని ఆశించారు నిర్మాతలు. అయితే ఈ మధ్యే సనా ఖాన్‌తో ఐటం సాంగ్ చేస్తున్నపుడు కింద పడ్డాడు విశాల్. ఈ సందర్భంగా ఆయనకు గాయాలు కూడా అయ్యాయి. దాంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇదే ఈ చిత్ర విడుదల తేదీపై ప్రభావం చూపించింది. ఇప్పుడు మే 10న విడుదల చేయాలని చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Rashi khanna, Telugu Cinema, Tollywood, Vishal