జూనియర్ ఎన్టీఆర్ 19 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ఇలా జరుగుతుంది..

Jr NTR RRR: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదలు పెట్టి మొన్నటికి 19 ఏళ్లవుతుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించాడు జూనియర్. తెలుగు స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 3:52 PM IST
జూనియర్ ఎన్టీఆర్ 19 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ఇలా జరుగుతుంది..
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదలు పెట్టి మొన్నటికి 19 ఏళ్లవుతుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించాడు జూనియర్. తెలుగు స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ చెత్త రికార్డు వేచి చూస్తుంది. కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇన్నేళ్లు గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు తారక్. కేవలం 2009లో మాత్రమే ఓ కాలెండర్ ఇయర్ మిస్ చేసాడు. అప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో ప్రచారం చేసాడు.. వెంటనే యాక్సిడెంట్ అయింది.
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)


దాంతో 2009లోనే రావాల్సిన అదుర్స్ కాస్తా 2010 సంక్రాంతికి విడుదలైంది. దాంతో 2009 కూడా కావాలని తీసుకున్న బ్రేక్ కాదు. కానీ ఇప్పుడు మాత్రం తారక్ కెరీర్‌లో తొలిసారి రెండేళ్లు ఖాళీగా ఉండిపోయింది. రాజమౌళి కోసం రెండు కాలెండర్ ఇయర్స్ వదిలేసాడు జూనియర్. 2018లో అరవింద సమేత సినిమాతో వచ్చిన ఎన్టీఆర్.. గతేడాది ఖాళీగా వదిలేసాడు. ఇప్పుడు 2020లోనూ ఏ సినిమా రాలేదు.
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి (jr ntr rajamouli)
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి (jr ntr rajamouli)

దాంతో ఫస్ట్ టైమ్ 2019, 20 ఇయర్స్ జూనియర్ కెరీర్‌లో ఖాళీగా ఉండిపోయాయి. 2021 సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ విడుదల కానుంది. అయితే ఇప్పుడు వచ్చి గ్యాప్‌ను అప్పుడు పూర్తి చేయాలని చూస్తున్నాడు జూనియర్. మరోవైపు రామ్ చరణ్ కూడా 2019 సంక్రాంతికి వినయ విధేయ రామతో వచ్చాడు.. మళ్లీ 2020 ఖాళీ. అంటే ఆయన కూడా దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నట్లే. ఎంతైనా రాజమౌళితో సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.
First published: June 25, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading