స్వాతంత్య్ర దినోత్సం రోజున అభిమానులకు ఎన్టీఆర్ సర్‌ ఫ్రైజ్ గిప్ట్..

73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా  ప్రజలందరూ ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఎన్టీఆర్ తన అభిమానులకు సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చాడు.

news18-telugu
Updated: August 16, 2019, 8:36 AM IST
స్వాతంత్య్ర దినోత్సం రోజున అభిమానులకు ఎన్టీఆర్ సర్‌ ఫ్రైజ్ గిప్ట్..
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో
  • Share this:
73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా  ప్రజలందరూ ఘనంగా నిర్వహించారు. ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రుల నుంచి సామాన్యులు, సినీ ప్రముఖుల వరకు అందరు ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కొంత మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందజేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకలో తన కొడుకు అభయ్ రామ్..నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్న గెటప్‌లో మువ్వెన్నెల పతాకాన్ని సెల్యూట్ చేస్తున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో  పోస్ట్ చేసాడు. 

View this post on Instagram
 

#JaiHind


A post shared by Jr NTR (@jrntr) on

మొత్తానికి నేతాజీ గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ కుమారుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ (ఫైల్ ఫోటో)


ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్..‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న విడుదల కానుంది.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు