Jr NTR: జపాన్‌లో ఎన్టీఆర్ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది..

Jr NTR: తెలుగు హీరోలకు పక్క ఇండస్ట్రీలలో కూడా ఇమేజ్ లేదు.. మార్కెట్ లేదంటూ మొన్నటి వరకు కూడా వెక్కిరింపులు వచ్చాయి. కానీ బాహుబలి తర్వాత మన హీరోలకు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 26, 2020, 8:21 PM IST
Jr NTR: జపాన్‌లో ఎన్టీఆర్ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది..
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
  • Share this:
తెలుగు హీరోలకు పక్క ఇండస్ట్రీలలో కూడా ఇమేజ్ లేదు.. మార్కెట్ లేదంటూ మొన్నటి వరకు కూడా వెక్కిరింపులు వచ్చాయి. కానీ బాహుబలి తర్వాత మన హీరోలకు పక్క రాష్ట్రాలేం ఖర్మ.. పక్క దేశాల్లో కూడా మంచి ఇమేజ్ వచ్చింది. అందులోనూ జపాన్ లాంటి దేశాల్లో కూడా మన హీరోలను గుర్తు పడుతున్నారు. అక్కడ మన సినిమాలను చూస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్‌కు జపాన్‌లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఆయన ముత్తు సినిమాతో అక్కడ స్టార్ అయిపోయాడు.
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr)
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr)


ఆ తర్వాత ఇండియన్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు అంతటి ఇమేజ్ ఉంది. మన యంగ్ టైగర్‌ను వాళ్లు కూడా అభిమానిస్తున్నారు. ఈయన పాటలు చూసి మురిసిపోతున్నారు.. నందమూరి చిన్నోడి స్టెప్పులు చూసి ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పటికే జపాన్‌లోని రియాలిటీ షోలలో కూడా ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులు వేసారు. తాజాగా కొన్ని రోజుల నుంచి అక్కడ ఓ అన్నాచెల్లెళ్లు వరసగా జూనియర్ పాటలపై కవర్ సాంగ్స్ చేస్తున్నారు. వాళ్లే మునిరూ, ఆశాహి ససాకీ.

ఈ ఇద్దరూ ఇప్పటికే అశోక్ సినిమాలోని గోల గోల పాటకు డాన్స్ చేసారు. దాని తర్వాత కూడా రెండు పాటలు చేసారు. ఇప్పుడు సింహాద్రి సినిమాలోని చీమ చీమ పాటపై కూడా కవర్ సాంగ్ చేసారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాట మొదట్లో రమ్య శ్రీ, బ్రహ్మానందం పాడిన చిన్న లైన్స్ కూడా మునిరు, ఆశాహి చేసి చూపించారు. ఆ తర్వాత సేమ్ టూ సేమ్ ఎన్టీఆర్, అంకిత ఎలా అయితే చేసారో.. అచ్చం అలాగే చేసారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 26, 2020, 8:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading