హోమ్ /వార్తలు /సినిమా /

NTR: ’11 ఏళ్లప్పుడు పిలిపించి నా పేరును తాతయ్యే మార్చారు.. ఆయన చెప్పిన మాటలు విని అమ్మ ఏడ్చేసింది‘

NTR: ’11 ఏళ్లప్పుడు పిలిపించి నా పేరును తాతయ్యే మార్చారు.. ఆయన చెప్పిన మాటలు విని అమ్మ ఏడ్చేసింది‘

సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫొటోలు)

సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫొటోలు)

ఇక పౌరాణిక పాత్రల్లో కూడా తాత ఎన్టీఆర్ లా రాణిస్తారని, యమదొంగతో నిరూపించారు. విలన్ పాత్రలను కూడా పోషించిన చరిత్ర సీనియర్ ఎన్టీఆర్ ది. అందుకే జై లవకుశ సినిమాలో, జూనియర్ తనలోని విలనిజాన్ని కూడా చూపించి తాతకు తగ్గ మనవడిని అనిపించుకున్నారు. జనవరి 18న, సీనియర్ ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంకా చదవండి ...

  తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ, ధ్రువ తార మీరే.. ఇదీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్. నందమూరి అభిమానులంతా జూనియర్ ఎన్టీఆర్ లో సీనియర్ ఎన్టీఆర్ ను చూసుకుంటున్నారు. నటనలోనూ, వాక్చాతుర్యంలోనూ జూనియర్ ను చూస్తోంటే పెద్దాయనే గుర్తుకు వస్తారని అభిమానులు చెబుతుంటుంటారు. ఇక పౌరాణిక పాత్రల్లో కూడా ఎన్టీఆర్ లా రాణిస్తారని, యమదొంగతో నిరూపించారు. విలన్ పాత్రలను కూడా పోషించిన చరిత్ర సీనియర్ ఎన్టీఆర్ ది. అందుకే జై లవకుశ సినిమాలో, జూనియర్ తనలోని విలనిజాన్ని కూడా చూపించి తాతకు తగ్గ మనవడిని అనిపించుకున్నారు. జనవరి 18న, సీనియర్ ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  ’నాకు అప్పుడు పదకొండేళ్ల వయసు. నాన్న నుంచి అమ్మకు ఫోన్ వచ్చింది. వెంటనే నన్ను అమ్మ నాకు కొత్త బట్టలు వేసి రెడీ చేసింది. ఎక్కడికి అమ్మా అని నేను అడిగాను. ‘మీ తాతయ్య నిన్ను చూడాలని అన్నారట. మీ నాన్న ఫోన్ చేసి చెప్పారు. కారు పంపించారు‘ అని అమ్మ చెప్పింది. నాలో ఏదో తెలియని ఉత్కంఠ. వినడమే కానీ, ఆయన్ను నేను అంతవరకు చూడలేదు. తాతగారి పీఎస్ మోహన్ వచ్చారు. కారులో నన్ను తీసుకెళ్లారు. తాతయ్య ఇంట్లో అడుగుపెట్టగానే నాకు ఏదో తెలియని ఉద్వేగం. అప్పుడు తాతయ్య కాషాయవస్త్రాల్లో ఉన్నారు. కింద నేలమీద కూర్చుని ఏవో గ్రంథాలు ముందేసుకుని కూర్చున్నారు. ’రండి‘ అని పిలిచారు. నేను వెళ్లి ఆయన ముందు కూర్చున్నా. ’మీ పేరేంటి‘ అని అడిగారు. ’తారకరామ్‘ అని చెప్పాను. నా పుట్టినరోజేంటో అడిగారు. ఏ సమయంలో పుట్టాడని నాన్నను అడిగారు. నా చేయిచూశారు. ఏవే పుస్తకాల్లో చూశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి నాన్నా హరీ.. అంటూ నాన్నను కేకేశారు. ’పేరు మార్చాలి. తారకరామ్ కాదు. నాపేరే పెడుతున్నా. ఇకపై నందమూరి తారకరామారావు అనే పిలవండి. పేరు మార్చండి‘ అని చెప్పారు‘ అని జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

  అప్పటి నుంచి దాదాపు ఏడాది పాటు తాతగారితోనే కలిసి ఉన్నానని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. విశ్వామిత్ర సినిమాలో ఆయనతో కలిసి తాను నటించిన మధుర క్షణాలను చెప్పుకొచ్చారు. పురాణ పాత్రల్లో నటించేటప్పుడు తాతయ్య అస్సలు మాంసాహారం ముట్టరనీ, మామూలు సమయాల్లో అయితే నాన్ వెజ్ ను అస్సలు వదిలిపెట్టరన్నారు. ఓ రోజు అమ్మ స్వయంగా వండి క్యారేజీని తాతయ్యకు పంపింది. తాతయ్యకు అమ్మ వండిన వంటలు బాగా నచ్చాయి. వెంటనే అమ్మకు ఫోన్ చేసి పిలిపించారు. ’ఇన్నేళ్లుగా దూరంగా ఉన్నాం. వాటి గురించి మీరేం పట్టించుకోవద్దు. నాకు వంశోద్ధారకుడిని ఇచ్చారు. నా అంతటి వాడు అవుతాడు. మీరే జాగ్రత్తగా చూసుకోండి. నా తరపున ఏం చేయాలో అన్నీ చేస్తా.‘ అని అన్నప్పుడు అమ్మ కళ్లల్లో ఏదో తెలియని ఆనందం కనిపించింది. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తాతయ్య మరణం మమ్మల్ని తీవ్ర శోకంలోని నెట్టేసింది.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Chandrababu naidu, Harikrishna, Jr ntr, Tdp

  ఉత్తమ కథలు