Jr NTR : భార్య లక్ష్మీ ప్రణతిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆమె వల్లే తనకు అసలు విషయం బోధ పడిందన్న తారక్..

భార్య లక్ష్మీ ప్రణతిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు (File/Photo)

Jr NTR : ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  Jr NTR :  భార్య లక్ష్మీ ప్రణతిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆమె వల్లే తనకు అసలు విషయం బోధ పడిందన్న తారక్.. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలతో పాటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమవుతోంది. ఈ షోలో ఎన్టీఆర్.. హాట్ సీట్‌లో ఉన్నకంటెస్టెంట్స్‌కు  ప్రశ్నలు అడగటంతో పాటు వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు మధ్యలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు.   ఈ నేపథ్యంలో ఎన్టీఆర్... తన తండ్రి హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు తారక్.

  దాంతో పాటు క్రికెట్ పై తనకు ఆసక్తి తగ్గడానికి తన నాన్నే కారణం అంటూ చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్‌తో చేసిన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్‌లో తనకు పెట్స్ అంటే ఇష్టమే. కానీ ఇపుడు వాటిపై అంత ఆసక్తి లేదని తెలియ పరిచారు. తాజాగా ఎన్టీఆర్.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌లో తన పెళ్లి నాటి ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్‌తో ఎన్టీఆర్ మీది పెద్దలు అరెంజ్ చేసిన పెళ్లట.

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో ఎన్టీఆర్ (Twitter/Photo)


  కానీ ఆమె ఎస్ చెప్పడానికి నెల పట్టిందట ఎందుకు అని ఆసక్తికర ప్రశ్న వేసారు. ఈ సందర్భంగా తారక్..  తన వివాహానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈయన కనీసం నెల రోజులకైనా  కాబోయే ఆవిడతో మాట్లాడాడు. నా పెళ్లి చూపులు అపుడైతే.. మా ఆవిడ లక్ష్మీ ప్రణతి అసలు మాట్లాడితే ఒట్టు అంటూ నవ్వులు పూయించారు.

  Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..


  పెళ్లి చూపుల్లో నా భార్యను చూడగానే నేను ఓకే చెప్పేసి వెళ్లిపోయాను. కానీ మా ఆవిడ నాకు ఎస్ చెప్పలేదు. అలా అని నో చెప్పలేదు. నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేసారా ? అని అడిగాను. దానికి ఆమె అప్పట్లో ఔననో .. కాదనో సమాధానం ఇవ్వలేదు.  ఇక మా పెళ్లికి.. నిశ్చితార్ధనానికి మధ్య 8 నెలల గ్యాప్ వచ్చింది. ఈ 8 నెలల్లో ఆమె ఎస్ చెప్పింది లేదు.

  Balakrishna - Pawan Kalyan: బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీలతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..

  దీంతో ఆడవాళ్లను అర్ధం చేసుకోవడం ఎంతో కష్టమో అపుడే తనకు అర్ధమైందన్నారు. ఇక ఆడవాళ్లను అర్ధం చేసుకున్నవాడు దేన్నైనా అర్ధం చేసుకుంటాడనే విషయం నాకు ఆ తర్వాత బోధ పడిందన్నారు. ఆడవాళ్ల మనసు గెలుచుకున్న వాళ్లు దేన్నైనా జయిస్తారనే విషయం తనకు అర్ధమైందన్నారు. ఇక ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహాం అయి 10 యేళ్లు పూర్తైయింది.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  ప్రస్తుతం ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేసారు. మరోవైపు ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు త్వరలో కొబ్బరికాయ కొట్టనున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: