జూనియర్ ఎన్టీఆర్ ఆది @18 ఇయర్స్.. ఎన్నో రికార్డులకు ఆది..

Jr NTR: ఆది.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో రికార్డులకు ఆది ఈ ఆది. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో అప్పటికే చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు..

Praveen Kumar Vadla | advertorial
Updated: March 28, 2020, 3:43 PM IST
జూనియర్ ఎన్టీఆర్ ఆది @18 ఇయర్స్.. ఎన్నో రికార్డులకు ఆది..
ఆది సినిమాకు 18 ఏళ్లు పూర్తి (aadi movie @ 18 years)
  • Advertorial
  • Last Updated: March 28, 2020, 3:43 PM IST
  • Share this:
ఆది.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో రికార్డులకు ఆది ఈ ఆది. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో అప్పటికే చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు సినిమాలు చేసారు.. మళ్లీ అలాంటి నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడు.. 19 ఏళ్ల కుర్రాడు కలిసి చేసిన సినిమా ఆది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. అలాంటి ఆది సినిమా విడుదలై నేటికి సరిగ్గా 18 ఏళ్లు గడిచిపోయింది. 2002, మార్చ్ 28న పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది ఆది. అప్పటికి స్టూడెంట్ నెం 1 సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా నందమూరి ఇమేజ్ కూడా ఉంది.

ఆది సినిమాకు 18 ఏళ్లు పూర్తి (aadi movie @ 18 years)
ఆది సినిమాకు 18 ఏళ్లు పూర్తి (aadi movie @ 18 years)


అలాంటి సమయంలో ఎన్నో తంటాలు పడి ఎన్టీఆర్‌కు ఆది కథ చెప్పి ఒప్పించాడు వినాయక్. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించడంతో ఆది సినిమాపై అంచనాలు మామూలుగానే ఉన్నాయి. కేవలం 19 ఏళ్ల జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరో. ముఖ్యంగా ఈ చిత్రంలో కాలేజ్ ఎపిసోడ్స్‌లో ఎల్బీ శ్రీరామ్ గుడ్ మార్నింగ్ కామెడీ సీక్వెన్స్.. సెకండాఫ్ ఎమ్మెస్ నారాయణ అస్సాం ఎపిసోడ్స్ చాలా బాగా పేలాయి. ఆది విడుదలైన రోజు టాక్ ఓ సంచలనం. మార్నింగ్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం చూస్తుండగానే 50, 100, 150, 175 రోజుల పండగ చేసుకుంది. ఈ సినిమా గురించి 18 ఏళ్లైనా కూడా ఇప్పటికీ చెప్తుంటాడు వినాయక్.

ఆది సినిమాకు 18 ఏళ్లు పూర్తి (aadi movie @ 18 years)
ఆది సినిమాకు 18 ఏళ్లు పూర్తి (aadi movie @ 18 years)


నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఆది సినిమా అయితే ఆ రోజుల్లోనే 106 కేంద్రాల్లో 50 రోజులు.. 96 కేంద్రాల్లో 100 రోజులు.. 3 కేంద్రాల్లో డైరెక్టుగా 175 రోజులు ఆడేసింది. దాదాపు 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఆది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు ఇంకా కొన్ని అలాగే ఉండిపోయాయి. మణిశర్మ పాటలు.. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్.. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలవరీ.. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ అన్నీ కలిసి ఆది సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.
Published by: Praveen Kumar Vadla
First published: March 28, 2020, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading