Thellavarithe Guruvaram Trailer: ‘తెల్లవారితే గురువారం’ ట్రైలర్ రివ్యూ.. ఫస్ట్ నైట్‌కు ఇంకా టైమ్ ఉందిరా..!

తెల్లవారితే గురువారం ట్రైలర్ (thellavarithe guruvaram)

Thellavarithe Guruvaram Trailer: రాజమౌళి కుటుంబం నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్స్ చాలా మంది వచ్చారు. కానీ తొలిసారి నటుడిగా వచ్చి గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీ సింహా. రెండేళ్ళ కింద ‘మత్తు వదలరా’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన..

  • Share this:
రాజమౌళి కుటుంబం నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్స్ చాలా మంది వచ్చారు. కానీ తొలిసారి నటుడిగా వచ్చి గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీ సింహా. రెండేళ్ళ కింద ‘మత్తు వదలరా’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. ఆ సినిమాతో పర్లేదు అనిపించాడు. అందులో మంచి కామెడీతో ఆకట్టుకున్నాడు సింహా. ఇప్పుడు తెల్లవారితే గురువారం అంటూ వస్తున్నాడు. మణికాంత్ గెల్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చ్ 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఆయన చేతుల మీదుగానే ట్రైలర్ విడుదలైంది. తన తమ్ముళ్లు సాధిస్తున్న విజయాలను చూసి గర్వంగా ఉందంటూ కీరవాణి కొడుకులు కాలభైరవ, సింహా గురించి చెప్పుకొచ్చాడు తారక్. ఇదిలా ఉంటే తెల్లవారితే గురువారం ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. కామెడీ ప్రధానంగా సాగిన ఈ చిత్రంలో సత్య మరోసారి నవ్వించాడు.

ట్రైలర్ అంతా పెళ్లి, దాన్ని తప్పించుకోడానికి హీరో చేసే ప్రయత్నాల చుట్టూనే సాగింది. ఒక్క రాత్రిలో జరిగే కథలా కనిపిస్తుంది తెల్లవారితే గురువారం. కచ్చితంగా ఈ సినిమాతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు సింహా. తొలి సినిమాతో థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎంచుకున్న సింహా.. రెండో సినిమా కోసం జోనర్ మార్చేసాడు. రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు.

వారాహి, లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మార్చ్ 26న రంగ్ దే, అరణ్య సినిమాలు విడుదలవుతుంటే.. ఆ మరుసటి రోజు తెల్లవారితే గురువారం విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published: