సినీ పరిశ్రమలో ఒక హీరో వద్దనుకున్న స్టోరీని మరో హీరో యాక్సెప్ట్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్టోరీనే పవన్ కళ్యాణ్ ఓకే చేసినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
సినీ పరిశ్రమలో ఒక హీరో వద్దనుకున్న స్టోరీని మరో హీరో యాక్సెప్ట్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్టోరీనే పవన్ కళ్యాణ్ ఓకే చేసినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అనుష్క శెట్టి హీరోయిన్గా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీకి ఒకే చెప్పాడు. ఈ చిత్రానికి ‘ఇపుడే మొదలైంది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ స్టోరీని ముందుగా హరీష్ శంకర్ ఎన్టీఆర్‌కు చెప్పాడట. కానీ తారక్.. ఈ కథను విని రిజెక్ట్ చేసాడట. ఇపుడు అదే కథను కొద్దిగా మార్పులు చేసి పవన్ కళ్యాణ్‌కు వినిపించడాట హరీష్ శంకర్. ఈ కథ విని పవన్ కళ్యాణ్ ఎంతో ఇంప్రెస్ అయి ఈ సినిమాను ఓకే చేసినట్టు సమాచారం.
ఎన్టీఆర్ జూనియర్, పవన్ కళ్యాణ్ (File/Photo)
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌కు హరీష్ శంకర్ కెవ్వు కేక పుట్టించేలా మరో హిట్ అందిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ చిత్రానికి కూడా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.