హోమ్ /వార్తలు /సినిమా /

తాత పాత్రను చేయనంటున్న జూనియర్ ఎన్టీఆర్

తాత పాత్రను చేయనంటున్న జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ అరవింద సమేత

ఎన్టీఆర్ అరవింద సమేత

తాతను అనుకరిస్తూ... చాలా సినిమాల్లో తారక్ చెప్పిన డైలాగులు అభిమానుల చేత ఈలలు వేయించాయి.

జూనియర్ ఎన్టీఆర్... నందమూరి వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. బాల్య నటుడిగానే వెండితెరపై మెరిసి అందరి మన్ననలు పొందాడు. తాతకు తగ్గ మనవడిగా తక్కువ కాలంలోనే నటనలో శభాష్ అనిపించుకున్నాడు. ఇక తాతను అనుకరిస్తూ... చాలా సినిమాల్లో తారక్ చెప్పిన డైలాగులు అభిమానుల చేత ఈలలు వేయించాయి. అయితే తాత ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతున్నా జూనియర్... తాత పాత్రలో నటించడానికి మాత్రం ససేమిరా అంటున్నాడు. కారణం ఏంటో తెలియదు కానీ... ఇప్పటివరకు తాత ఎన్టీఆర్ పాత్రలో నటించాలని జూనియర్‌కు రెండు అద్భుతమైన ఆపర్లు వచ్చాయి. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహానటిలో జూనియర్ ఎన్టీఆర్‌ను... సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో చేయమని అడిగారు. అయితే అప్పట్లో ఈ అవకాశాన్ని జూనియర్ సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు మరోసారి జూనియర్‌కూడా ఇలాంటి ఆఫరే వచ్చింది. తాజాగా జయలలిత బయోపిక్‌లో కూడా ఎన్టీఆర్ పాత్రలో నటించాలని కొందరు ఈ యంగ్ హీరోను సంప్రదించారు. దీంతో ఆ ఆఫర్‌ను కూడా ఎన్టీఆర్ సున్నితంగా కాదన్నాడు. జయలలిత బయోపిక్‌లో కంగనా రనౌత్ నటిస్తున్నారు. మరోవైపు ఇటు జూనియర్ కూడా ట్రిపుల్ ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

First published:

Tags: Jayalalitha, Jayalalithaa Biopic, Jr ntr, Tollywood, Tollywood Movie News, Tollywood news

ఉత్తమ కథలు