Home /News /movies /

JR NTR RAM CHARAN STARRER RRR MOVIE CREATES NEW SENSATIONAL RECORDS IN USA PRE BOOKINGS SRD

RRR Movie: అమెరికాలోనూ ఆర్ఆర్ఆర్ అరాచకం.. విడుదలకు ముందే రికార్డుల సునామీ..

RRR Movie

RRR Movie

RRR Movie: ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఖాతాలో మరో అరుదైన రికార్డు.. విడుదలకు ముందే అక్కడ రచ్చ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

  ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. విడుదలకు ముందే అక్కడ రచ్చ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌,అజయ్ దేవ్‌గణ్ (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి.

  ఇక కేవలం ఇండియాకే పరిమితం కాకుండా అమెరికాలోనూ ఆర్‌.ఆర్‌.ఆర్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా విడుదల కంటే ముందే ఆర్‌.ఆర్‌.ఆర్‌ రికార్డులను తిరగరాయడం ప్రారంభించింది. ప్రీ బుకింగ్స్‌తో అమెరికాలో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోందీ చిత్రం. ఇప్పటి వరకు ప్రీసేల్స్‌ ఏకంగా 1 మిలియన్ ( 10 లక్షల) మార్కు రికార్డుని బ్రేక్‌ చేసింది.

  ఈ నేపథ్యంలో అమెరికాలోని సీని మార్క్‌లో 5 లక్షల డార్లు, రీగల్‌లో లక్షన్నర డాలర్లు, ఇమాజిన్‌లో 3 లక్షల డాలర్ల వసూళ్లను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సినిమా. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అమెరికాలో ఇది సరికొత్త రికార్డు. సినిమా విడుదలకు ఇంకా 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

  ఇక అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే మరి భారత్‌లో ఆర్‌.ఆర్.ఆర్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసిన టీమ్.. రీసెంట్‌గా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఓ రేంజ్‌లో ఉందని అంటున్నారు నెటిజన్స్. కొన్ని సీన్స్ మాత్రం రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

  ఇక ఈ ట్రైలర్‌ను చూసిన సినీ ప్రముఖులు సైతం అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు.ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ చుట్టు చుట్టేసారు. త్వరలో ఈ టీమ్ ఓవర్సీస్‌లో కూడా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచనున్నారు. లేటెస్ట్ గా యూఎస్ న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ బిల్డింగ్‌ పై ఈ సినిమా పోస్టర్‌తో పాటు పాటలను ప్రదర్శిస్తున్నారు. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి సినిమా ఇదే అని చెప్పొచ్చు.

  ఇది కూడా చదవండి : రష్మిక నుంచి కృతి శెట్టి వరకు.. ఈ ఏడాది టాలీవుడ్ ను శాసించిన హీరోయిన్లు వీళ్లే..

  స్పైడర్ మ్యాన్, అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌తో పాటు పాటలను డిస్‌ప్లే చేసిన సందర్భాలున్నాయి. కొన్ని బాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన మ్యూజిక్‌ను ప్రదర్శించారు. మొత్తంగా విడుదలకు ముందు ఆర్ఆర్ఆర్ తన ఖాతాలో మరో రికార్డు నమోదు చేసిందనే చెప్పాలి.

  ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌కు తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు.

  ఇది కూడా చదవండి : వివాదాల స్వామితో రష్మిక పూజలు.. వైరలవుతున్న వీడియో..

  ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Alia Bhatt, Jr ntr, Ramcharan, RRR, SS Rajamouli, Tollywood news, USA

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు