Mahesh Babu-NTR-Ram Charan | మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఈ ముగ్గరు ఆ దారిలో వెళ్లి అడ్డంగా బుక్ అయ్యారు. వీళ్లతో పాటు చాలా మంది హీరోలు దాని బారిన పడి బలైపోయారు. వివరాల్లోకి వెళితే.. సినిమా తీయటమే కాదు... సినిమాకి పేరు పెట్టడం కూడా ఓ కళే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందీ అంటారా? మరేం లేదండీ... కొన్ని సార్లు సినిమా ఆడకపోవటమే కాదు... దానికి పెట్టిన పేరు కూడా అదో రకం తలనొప్పి తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా, సినిమా పేరు అప్పుడప్పుడూ హీరోకి ప్రాబ్లంగా మారుతుంది. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో .. టైటిల్లో హీరో పేరు వచ్చేటట్టు తెరకెక్కిన సినిమాలేవి నడిచిన దాఖలాలు లేవు. గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ పేరు కూడా రామ్ చరణ్‌కు ఇలాంటి చిక్కులే తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఫ్లాప్‌ను మూట గట్టుకుంది. ఈ సినిమా టైటిల్ ‘వినయ విధేయ రామ’లోనే రామ ఉండటంతో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదంటున్నారు కొంత మంది విశ్లేషకులు. అంతేకాదు ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్లో అత్యంత చెత్తగా తెరకెక్కిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

వినయ విధేయ రామ ఫైల్ ఫోటో
అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్లో కనిపించలేదు.

అఖిల్ మూవీ
అఖిల్‌కే కాదు...అక్కినేని ఫ్యామిలీ అసలు సిసలు అందగాడు...నాగార్జునకి కూడా సేమ్ ట్రబుల్ ఫేస్ చేసాడు. చాలా ఏళ్ల కింద మన కింగ్...‘కెప్టెన్ నాగార్జున’ అని ఆయన పేరే కలిసి వచ్చే టైటిల్‌తో ఒక సినిమా చేసాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. అంతేకాదు హీరో పేరే సినిమాకు పెట్టడం పెద్ద రిస్కే అని సిగ్నల్స్ ఇచ్చింది.

కెప్టెన్ నాగార్జున యూట్యూబ్ క్రెడిట్
అలాగే మెగాస్టార్ కూడా ఆయన సొంత పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో చేసిన సినిమా కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు ఆయన పేరు కలిసి వచ్చేటట్టు చేసిన ‘జై చిరంజీవ’ కూడా అదే రూట్లో అట్టర్ ఫ్లాపైంది.

జై చిరంజీవా ఫేస్బుక్ ఫోటో
ఒకవైపు మంచు విష్ణు కూడా ‘విష్ణు’ టైటిల్ తో చేసిన ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన పేరు కలిసొచ్చేలా చేసిన ‘రామయ్య వస్తావయ్యా’ కూడా ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయలేక చేతులేత్తేసింది. ఈ సినిమా కంటే ముందు తన పేరు కలిసొచ్చేలా చేసిన ‘అల్లరిరాముడు’ సినిమాతో జూనియర్ అల్లరైపోయాడు.

రామయ్య వస్తావయ్యా (ఫేస్బుక్)
మరోవైపు ఇంకో నందమూరి నటవారసుడు తారకరత్న కూడా ‘తారక్’ టైటిల్ తో చేసిన మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ ఖాతాలో చేరింది.. ఇక స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పేరుతో వచ్చిన ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ కూడా బాక్సాఫీస్ దగ్గర దివాళా తీసింది.

బ్రహ్మానందం డ్రామా కంపెనీ (యూట్యూబ్ క్రెడిట్)
ఇక వెంకటేశ్ కూడా ఆయన పేరుతో తెరకెక్కిన ‘నమో వెంకటేశా’ సినిమా కూడా అంతమాత్రంగానే నడిచింది. రీసెంట్గా మేనల్లుడు నాగచైతన్యతో చేస్తోన్న సినిమాకు ‘వెంకీ మామ’ సినిమా కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఏదో ఒడ్డున పడింది.

’వెంకీ మామ’పోస్టర్ (Instagram/Photo)
హీరోల అసలు పేర్లు పెడితే ప్లాప్ అయ్యాయి సరే...కానీ ఇంట్లో పిలిచే నిక్ నేమ్స్ పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. అందులో హీరో మహేష్ బాబు నటించిన ‘నాని’ సినిమా ఒకటి. మహేష్‌బాబును ఇంట్లో ముద్డుగా అందరు నాని అనే ముద్దు పేరుతో పిలుస్తారు. అదే పేరు సినిమాకు పెడితే మాత్రం అట్టర్ ఫ్లాపైంది.

మహేష్ నాని మూవీ
తన పేరుతోనే సినిమా తీసిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. ఈ కథానాయకుడు...తన పేరు కలిసి వచ్చేటట్టు చేసిన ‘తేజ్..ఐ లవ్ యూ’ కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ ఐ లవ్ యూ (ఫేస్బుక్ ఫోటో)
ఒక్క అల్లు అర్జున్ మాత్రం ఇందుకు మినహాయింపు..ఈ హీరో ముద్దు పేరు బన్ని అని తెలుసుగా.. ఈ టైటిల్‌తో అల్లు వారి అబ్బాయి చేసిన ‘బన్ని’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్టైయింది.

అల్లు అర్జున్ ‘బన్ని’ మూవీ
తన పేరు పెట్టుకుని సినిమాలను సక్సెస్ చేయించిన మరో టాలీవుడ్ హీరో నటరత్న ఎన్టీఆర్. ఈ తారకరాముడు ఒక్కటి కాదు...బోలెడన్ని సినిమాలు రాముడి పేరు పెట్టి హిట్ అందుకున్నాడు. అందులో ‘అడవి రాముడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘అగ్గి రాముడు’ వంటి చాలా సినిమాలే ఉన్నాయి.

‘ఎన్టీఆర్’ అడవిరాముడు, డ్రైవర్ రాముడు (వీకీపీడియా క్రెడిట్)
మరోవైపు నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా...ఆయన పేరు కలిసి వచ్చేలా చేసిన ‘అల్లరి కృష్ణయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘బాల గోపాలుడు’ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నారు.

బాల గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య (వీకీపీడియా క్రెడిట్)
ఈ రకంగా ఎక్కువ మటుకు హీరోల పేర్ల మీదున్న టైటిల్స్‌తో వచ్చిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోయినవే ఎక్కువున్నాయి.