ఎన్టీఆర్ గొప్ప.. కాదు చరణ్ గొప్ప.. RRR రచ్చ షురూ..

RRR: మా హీరో గొప్పంటే కాదు మా హీరోనే గొప్ప అంటూ వాళ్లు హెచ్చులకు పోతుంటారు. ఇప్పుడు మెగా, నందమూరి హీరోలు కలిసి నటిస్తున్న RRR సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 9:02 PM IST
ఎన్టీఆర్ గొప్ప.. కాదు చరణ్ గొప్ప.. RRR రచ్చ షురూ..
ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ (RRR motion poster)
  • Share this:
తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఇగో.. హీరోల మధ్య స్నేహం ఉన్నా కూడా అభిమానుల మధ్య మాత్రం చంపుకునేంత అభిమానం ఉంటుంది. మా హీరో గొప్పంటే కాదు మా హీరోనే గొప్ప అంటూ వాళ్లు హెచ్చులకు పోతుంటారు. ఇప్పుడు మెగా, నందమూరి హీరోలు కలిసి నటిస్తున్న RRR సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసాడు దర్శక ధీరుడు రాజమౌళి. దీనికి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా చరణ్, ఎన్టీఆర్ లుక్స్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.
ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ (RRR motion poster)
ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ (RRR motion poster)

నిజానికి చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ స్నేహితులే. కానీ వాళ్ల అభిమానుల మధ్య మాత్రం ఇప్పుడు వార్ జరుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఇదే జరిగింది. RRR మోషన్ పోస్టర్‌లో చరణ్ నిప్పులోంచి.. ఎన్టీఆర్ నీటిలోంచి వచ్చాడు. దాంతో చరణ్‌ను నిప్పులా.. ఎన్టీఆర్‌ను నీటితో పోలుస్తున్నారు ఫ్యాన్స్. నిప్పే గొప్పని చరణ్ ఫ్యాన్స్.. కాదు నీళ్లే అన్నింటికంటే శక్తివంతమైందని తారక్ అభిమానులు వాదించుకుంటున్నారు ఇప్పుడు.

ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ (RRR motion poster)
ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ (RRR motion poster)

సోషల్ మీడియాలో ఈ వార్ ఎక్కువైపోయిందిప్పుడు. దానికి తోడు టైటిల్ లోగోలో చరణ్‌ను ముందు పెట్టి.. తారక్‌ను వెనుక పెట్టడంతో కావాలనే తమ హీరోను తక్కువ చేసాడంటూ రాజమౌళిపై మండి పడుతున్నారు తారక్ ఫ్యాన్స్. మొత్తానికి స్టోరీ వైజ్‌గా ఏది కావాలంటే రాజమౌళి అది చేస్తాడు.. కాంప్రమైజ్ కాడని అభిమానులకు కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు ఇలా గొడవ పడుతున్నారనేది అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకేసారి RRR విడుదల రోజు అంటే జనవరి 8న తేలనుంది.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు