ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్..

ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ సినిమాల తర్వాత కెజియఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 5, 2020, 4:37 PM IST
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్..
దానికి కారణం ప్రశాంత్ నీల్ సినిమానే. కెజిఎఫ్ లాంటి భారీ సినిమా తర్వాత జూనియర్‌తో సినిమాకు కమిట్ అయ్యాడు ఈ దర్శకుడు. ప్యాన్ ఇండియన్ లెవల్‌లో ఈ సినిమా వస్తుంది. ఎలాగూ ట్రిపుల్ ఆర్‌తో జూనియర్‌కు బాలీవుడ్‌లో కూడా మార్కెట్ వచ్చేస్తుంది.
  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా  మరో కథానాయికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈచిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెజియఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు. ప్రశాంత్ నీల్‌ కెజియఫ్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంటూ ఊర్రుతలూగిస్తుంది.

director prashanth neel u turn on ntr movie here are the details,jr ntr,prashanth neel,jr ntr atlee,jr ntr birthday,jr ntr prashanth neel,Ntr news,NTR to work with prashanth neel, Janhvi kapoor to romance with tarak , Ntr trivikram new film, pooja hegde,ntr,jr ntr,jr ntr politics,jr ntr tdp politics,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్,పూజాహెగ్డే, ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్ పుట్టినరోజు,ఎన్టీఆర్ అట్లీ,ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా క్యాన్సిల్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ Photo : Twitter


దీంతో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంచనాలు మరో రేంజ్‌లో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ కథను సిద్ధం చేస్తున్నట్టు  గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెష్ తెలియజేస్తే.. అతనితో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. త్వరలోనే రేడియేషన్ సూట్ ధరించి మీ వద్దకు రాబోతున్నా అని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేసాడు. అలాగే జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. గొప్ప మనసు కలిగిన దర్శకుడికి శుభాకాంక్షలు అంటూ .. త్వరలో మిమ్మల్ని రేడియేషన్ సూట్‌లో కలవబోతున్నాం అంటూ ట్వీట్ చేసారు. ఈ రెండు ట్వీట్స్ బట్టి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాకు రేడియేషన్ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను న్యూక్లియర్ ప్లాంట్స్‌తో పాటు పర్యావరణ నేపథ్యంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. మొత్తానికి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 5, 2020, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading