news18-telugu
Updated: April 22, 2020, 12:04 PM IST
ఆర్ ఆర్ ఆర్ లుక్.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ Photo : Twitter
ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా అందరు హీరోలు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా ఒక్కోహీరో తన కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు.. వాళ్లు ఇన్నాళ్లు చూడని సినిమాలను చూస్తున్నారు. ఇంకొందరు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరికొందరు హీరోలు వేరే భాషలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా అదే పనిచేస్తున్నాడు. ఈయన ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌తో పాటు ఈ సినిమా టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత మరో విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. ఈ టీజర్‌కు ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఓ రేంజ్లో ఉంది.

ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ (RRR release date)
ఒక్క తెలుగులోనే కాదు... హిందీలో తమిళంలో,కన్నడలో ఎన్టీఆరే తన వాయిస్ అందించాడు. మలయాళంలో మాత్రం వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు. ఒక ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న ఓ సినిమాకు ఓ హీరో ఇన్ని భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పడం ఈ జనరేషన్లో ఇదే ప్రథమం అనే చెప్పాలి. అంతేకాదు ఆయా భాషల్లో ఎన్టీఆర్ వాచకం ఎక్కడా తడబడలేదు. కానీ ఇపుడు లాక్డౌన్లో ఎన్టీఆర్ మలయాళ భాషపై పట్టుపెంచుకుంటున్నారు. దీని కోసం మోహన్ లాల్ కూడా సహాయం కూడా తీసుకుంటున్నాడు. త్వరలో మలయాళంలో కూడా ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రస్తుతం ఇంట్లో మలయాళ భాషపై పట్టుపెంచుకుంటున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ లాక్డౌన్లో ఖాళీగా ఉండకుండా మలయాళ భాషను నేర్చుకోవడం అభినందించాల్సిన విషయము.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
April 22, 2020, 12:04 PM IST