RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తే పిచ్చెక్కుతుంది..

Jr NTR: జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మ‌రో ఆర్నెళ్ల పాటు బిజీగా ఉంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది సమ్మర్ వరకు ఎన్టీఆర్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 6:25 PM IST
RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తే పిచ్చెక్కుతుంది..
జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Jr NTR)
  • Share this:
జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మ‌రో ఆర్నెళ్ల పాటు బిజీగా ఉంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది సమ్మర్ వరకు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఇద్ద‌ర్నీ వ‌దిలేస్తాన‌ని చెప్పాడు రాజ‌మౌళి. 2021, జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది. అప్ప‌టి వ‌ర‌కు ఏదో ఓ ప‌ని మీద అక్క‌డే లాక్ చేస్తాడు ద‌ర్శ‌క‌ధీరుడు. దాంతో వ‌చ్చే ఏడాది వ‌ర‌కు RRR త‌ప్ప మ‌రో ధ్యాసే ఉండ‌దు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు. ఇక రామ్ చ‌ర‌ణ్ ప‌రిస్థితి కూడా అంతే. అయితే ఇప్పుడు RRR త‌ర్వాత ఎన్టీఆర్ ఏం చేస్తాడు.. ఎవ‌రితో సినిమాలు చేస్తాడు అనేది మాత్రం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్టీఆర్ 30 పోస్టర్ Photo : Twitter
ఎన్టీఆర్ 30 పోస్టర్ Photo : Twitter


ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం జూనియ‌ర్ త‌ర్వాత మూడు సినిమాలు మాత్రం అగ్ర ద‌ర్శ‌కుల‌తోనే ఉండ‌బోతున్నాయి. ఇప్ప‌టికే వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈయ‌న‌.. RRR త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రకటన కూడా వచ్చింది. జూన్ లేదా జులై నుంచి సినిమా పట్టాలెక్కనుంది. హారిక హాసిని, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుంది. దీనికి కొర‌టాల స్నేహితుడు నిర్మాత‌గా ఉండ‌బోతున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ అట్లీ ప్రశాంత్ నీల్
జూనియర్ ఎన్టీఆర్ అట్లీ ప్రశాంత్ నీల్




మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని అట్లీ కుమార్ కూడా కన్ఫర్మ్ చేసాడు. త్వరలోనే తెలుగు సినిమా చేయబోతున్నానని.. అది కూడా తనకిష్టమైన ఎన్టీఆర్‌తో అని ఈ మధ్యే చెప్పాడు అట్లీ. ఇప్ప‌టికే త‌మిళ‌నాట వ‌ర‌స విజ‌యాల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. మొన్న బిగిల్ సినిమాతో ఏకంగా 300 కోట్లు వసూలు చేసాడు అట్లీ. ఇక మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ మ‌ధ్యే కెజియ‌ఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో తాము సినిమా చేయ‌బోతున్నామ‌ని అనౌన్స్ చేసారు. ఇందులో హీరోగా ఎన్టీఆర్ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

Jr NTR next 3 movies with the star directors of South Industry after RRR.. Here the list of them pk.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మ‌రో ఏడాది పాటు బిజీగా ఉంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అక్టోబ‌ర్ వ‌ర‌కే ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఇద్ద‌ర్నీ వ‌దిలేస్తాన‌ని రాజ‌మౌళి చెబుతున్నాడు. jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ


కెరీర్ గ్రాప్ పడిపోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఎందుకంటే గతంలో రాజమౌళితో సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాలు చేసిన తర్వాత ఒక్కసారిగా జూనియర్ కెరీర్ అంతా డైలమాలో పడిపోయింది. వరస ఫ్లాపులు ఈయన్ని బాగా ఇబ్బంది పెట్టేసాయి. అందుకే ఇప్పుడు RRR త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌, అట్లీ, ప్ర‌శాంత్ నీల్ లాంటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమాలు కానీ వర్కవుట్ అయితే ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు