తమిళ హీరో విజయ్‌కు ఎన్టీఆర్ ఫోన్.. కన్ఫామ్ చేసిన మహేష్..

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల మధ్య వివాదం తలెత్తింది. తాజాగా వీళ్లిద్దరు ఒకరికొకరు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

news18-telugu
Updated: December 2, 2019, 11:45 AM IST
తమిళ హీరో విజయ్‌కు ఎన్టీఆర్ ఫోన్.. కన్ఫామ్ చేసిన మహేష్..
జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు (Twitter/Photo)
  • Share this:
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల మధ్య వివాదం తలెత్తింది. వీళ్లిద్దరిలో ఎవరు అత్యుత్తమ డ్యాన్సర్ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే నడస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్.. కోలీవుడ్ కథానాయకుడు విజయ్‌ను ఫోన్ చేసి ప్రశంసించినట్టు ఎన్టీఆర్ మీడియా ప్రతినిధి కోనేరు మహేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈయనే తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’ సినిమాను తెలుగులో ‘విజిల్’ పేరుతో డబ్ చేసి  విడుదల చేసారు. తెలుగులో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విజయం సాధించిన నేపథ్యంలో నిర్మాత మహేష్ కొనేరు..విజయ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘బిగిల్’ సినిమా విజయం సాధించడంపై ఎన్టీఆర్ ..విజయ్‌కు  ఫోన్ చేసి ప్రశంసించినట్టు మహేష్ కోనేరు ఈ సందర్భంగా తెలియజేసారు. మరోవైపు విజయ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తనతో ఫోన్‌లో మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చూపించిన అభిమానికి విజయ్ సంతోషం వ్యక్తం చేశారు.First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>