జూనియర్ ఎన్టీఆరే కాదు.. ఆయన అభిమానులు కూడా కెవ్వు కేకే..

జూ ఎన్టీఆర్ (Twitter/Photo)

జూనియర్ ఎన్టీఆర్.. తాత సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి అంచలంచులుగా ఎదుగుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తన కంటూ సెపరేట్ ఇమేజ్  క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు ఆపదలో ఉన్నవారికి కూడా తనవంతు సాయం అందించడంతో ముందుంటాడు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో హీరో తారక్ మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్.. తాత సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి అంచలంచులుగా ఎదుగుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తన కంటూ సెపరేట్ ఇమేజ్  క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు ఆపదలో ఉన్నవారికి కూడా తనవంతు సాయం అందించడంతో ముందుంటాడు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో హీరో తారక్ మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు వీళ్లు కూడా కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఆకలితో బాధపడే అనాథల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సంబంధించిన టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు కొంత మంది కలిసి ‘డొనేట్ ఏ మీల్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫుట్‌పాత్‌ల మీద జీవిస్తూ.. అన్నం కోసం ఎదురు చూసే వాళ్ల కోసం టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యలు గత యేడాదిగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ‘టీమ్ తారక్ ట్రస్ట్’ సభ్యులు ‘డినేట్ ఏ మీల్’ అనే ఈ ప్రోగ్రామ్‌‌కు సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తన మహతి స్టూడియోలో ఆవిష్కరించారు. అంతేకాదు ఆకలితో బాధపడే అన్నార్తుల కోసం టీమ్ తారక్ ట్రస్ట్ కొన్నాళ్లుగా చేస్తున్న ప్రజాపయోగ కార్యక్రమాలను ఆయన అభినందించారు.  ఆకలితో బాధపడే అన్నార్తులకు తారక్ ట్రస్ట్ అండగా ఉండటం అభినందనీయమన్నారు.

టీమ్ తారక్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ‘డొనేట్ ఏ మీల్’ కార్యక్రమానికి సంబంధించిన వోచర్‌ను ఆవిష్కరించిన మణిశర్మ (Twitter/Photo)


హీరోల అభిమానులంటే కేవలం తమ హీరోల సినిమాలు విడుదలైనపుడు హంగామా చేయడమే కాదు. ఆ కథానాయకుడికి పేరు తెచ్చేలా చేయడం ఎంతో మందికి స్పూర్తి అన్నారు. ఈ తరహా సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి మంచి పనులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

‘డినేట్ ఏ మీల్’ కార్యక్రమానికి సంబంధించిన వోచర్ (Twitter/Photo)


అంతేకాదు తారక్‌తో తనకు మంచి అనుబంధముందున్నారు. ఆయనది మంచి హృదయమున్నవ్యక్తి అన్నారు. ఎన్టీఆర్ బాటలో అభిమానులు నడుస్తుండటం ఆనందంగా ఉందన్నారు. ప్రతిరోజూ వీలైనంత మంది ఆకలితో బాధపడే వారికి ఒక పూట కడుపునిండా భోజనం పెట్టడమే ‘డొనేట్ ఏ మీల్’ లక్ష్యమన్నారు టీమ్ సభ్యులు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published: