• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JR NTR NEXT FILM WILL BE SPORTS DRAMA IN BUCHI BABU DIRECTOR NR

Jr NTR: ఆ పాత్రలో నటించనున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త!

Jr NTR: ఆ పాత్రలో నటించనున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త!

Jr NTR: ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ నటిస్తున్నాడు.

Jr NTR: ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ నటిస్తున్నాడు.

  • Share this:
    Jr NTR: ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస ఆఫర్ లను అందుకోగా.. రాజమౌళి సినిమా తర్వాత, ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే మరో స్పోర్ట్స్ డ్రామా లో ఎన్టీఆర్ మరో సినిమా చేయనున్నట్లు తెలియగా.. ఇది మాత్రం ఫ్యాన్స్ కు పండగేనని అర్థమవుతుంది. ఇంతకీ ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరంటే..

    ఉప్పెన సినిమా తో స్టార్ ఆఫ్ ది డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు.. ఈ సినిమాతో తొలిసారిగా తన దర్శకత్వాన్ని వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. సుకుమార్ దగ్గర అసోసియేట్ గా చేసిన బుచ్చిబాబు మొత్తానికి ఓ మంచి క్రేజ్ అందుకున్నాడు. అంతేకాకుండా బుచ్చిబాబు తో సినిమాకు పలు స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారట. ఇదిలా ఉంటే బుచ్చిబాబు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. సుకుమార్ తో కలిసి బుచ్చిబాబు పనిచేసిన సమయంలో స్టార్ హీరోలను బుచ్చిబాబు పరిచయం చేసుకునేవాడట.

    అంతేకాకుండా నాన్నకు ప్రేమతో సినిమా లో బుచ్చిబాబు ఎన్టీఆర్ ను పరిచయం చేసుకోగా.. మొదట ఉప్పెన సినిమా కథ ఎన్టీఆర్ కే వినిపించాడు. ఇక ఆ తర్వాత మరో కథను వినిపించగా ఎన్టీఆర్ ఓకే కూడా చెప్పాడు. ఇక బుచ్చిబాబు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తో సుకుమార్ రైటింగ్ సంస్థలు కలిపి చేయబోయే ప్రాజెక్టుకు బుచ్చిబాబు ఓకే చెప్పగా మొత్తానికి ఎన్టీఆర్ ను ఈ సినిమాలో హీరోగా నియమించారు. ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్టులో బిజీగా ఉన్న బుచ్చిబాబు త్వరలోనే ఎన్టీఆర్ 31 సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Navya Reddy
    First published: