హోమ్ /వార్తలు /సినిమా /

Jr NTR: ఎన్టీఆర్ కొత్త యాడ్ చూసారా.. సినిమాటిక్ లెవల్లో పిక్చరైజ్.. వావ్ అంటున్న ఫ్యాన్స్..

Jr NTR: ఎన్టీఆర్ కొత్త యాడ్ చూసారా.. సినిమాటిక్ లెవల్లో పిక్చరైజ్.. వావ్ అంటున్న ఫ్యాన్స్..

జూనియర్ ఎన్టీఆర్ కొత్త యాడ్ చూసారా ? (Twitter/Photo)

జూనియర్ ఎన్టీఆర్ కొత్త యాడ్ చూసారా ? (Twitter/Photo)

Jr NTR: ఈ మధ్య కాలంలో మన తెలుగు సహా అన్ని భాషల్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్స్ ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులు సంపాదిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్.. ఓ కమర్షియల్ యాడ్ చేసారు. దానికి సంబంధించిన వీడియో నెటింట్లో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Jr NTR: ఈ మధ్య కాలంలో మన తెలుగు సహా అన్ని భాషల్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్స్ ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులు సంపాదిస్తున్నారు. ఇక బ్రాండింగ్‌లో ఎన్టీఆర్ కూడా తనదైన దూకుడు చూపిస్తున్నాడు. ఈయన నవరత్న ఆయిల్‌తో పాటు టాల్కమ్ పౌడర్, ఆపిల్ జ్యూస్‌కు చెందిన యాడ్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగ ఎన్టీఆర్ లూసియస్ అంటూ ఫిష్‌కు సంబంధించిన కమర్షియల్ యాడ్ చేసాడు. దానికి సంబంధించిన యాడ్‌ను విడుదల చేసారు. ఈ యాడ్‌లో ఎన్టీఆర్, రాహుల్ రామకృష్ణ నటించారు. ఇందులో ఎన్టీఆర్ కోర్టు బోనులో నిలబడితే.. రాహుల్ రామకృష్ణ లాయర్ పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఆరు పేజీల డైలాగులను అర సెకనులో చెప్పేసే మీకు ఇంత చిన్న డైలాగ్‌కు అంత టైమ్ అని అడగగా.. దానికి ఎన్టీఆర్.. చేప చిన్నదైనా.. ఎర పెద్దది వేయాలి. అంటూ లీసియస్ గురించి ప్రమోషన్ చేస్తున్నాడు.

కొంచెం సరదగా సాగే ఈ యాడ్ ఇపుడు నెటింగ్లో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ విషయానికొస్తే.. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో పలకరించారు. ఈ సినిమా సక్సెస్‌తో తారక్.. ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా నటించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివతో  చేయబోయే సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ కాస్త ఆలస్యమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.  ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అనగానే.. ముందుగా వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా గుర్తుకు వస్తోంది. అందుకే వీళ్ల కాంబోలో రెండో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతా బాగుంటే.. ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి అంతా సిద్ధమైంది. అందుకు తగ్గట్టు తారక్ కొత్త లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు.

ఇప్పటికే ఈయన తర్వాత సినిమాపై కన్ఫర్మేషన్ వచ్చింది. ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అధికారిక సమాచారం వచ్చినా కూడా.. ఆయన్ని కాదని కొరటాలతో సినిమా చేస్తున్నాడు తారక్. జనతా గ్యారేజ్ సినిమాతో ఆరేళ్ల కింద సంచలన విజయం సాధించిన వీళ్లిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు.వాళ్లు కూడా ఇదే చెప్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్‌లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసాడు కొరటాల శివ. మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.

First published:

Tags: Jr ntr, Tollywood

ఉత్తమ కథలు