NTR BirthDay: పుట్టినరోజున అభిమానులకు ఎన్టీఆర్ త్రిపుల్ ట్రీట్..

ఈ పుట్టినరోజున ఎన్టీఆర్ తన అభిమానులకు ఒకటికి మూడు స్పెషల్ ట్రీట్స్ ఇవ్వనున్నడు. ఇప్పటికే ఈ ట్రీట్స్ కూడా రెడీ అయిపోయినట్టు సమాచారం.  వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 17, 2020, 1:47 PM IST
NTR BirthDay: పుట్టినరోజున అభిమానులకు ఎన్టీఆర్ త్రిపుల్ ట్రీట్..
అందుకే చాలా జాగ్రత్తగా ప్యాన్ ఇండియన్ కథలను.. అలాంటి దర్శకులను ఎంచుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రశాంత్ నీల్ సినిమా కోసం కూడా ఏకంగా రెండేళ్లకు పైగా డేట్స్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.
  • Share this:
ఈ పుట్టినరోజున ఎన్టీఆర్ తన అభిమానులకు ఒకటికి మూడు స్పెషల్ ట్రీట్స్ ఇవ్వనున్నడు. ఇప్పటికే ఈ ట్రీట్స్ కూడా రెడీ అయిపోయినట్టు సమాచారం.  వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. చరిత్రలో ఎపుడు కలవని ఇద్దరు చారిత్రక యోధులు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో రచయత విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీని రెడీ చేసాడు. ఈ కథకు రాజమౌళి తనదైన కథనంతో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే పేరును ఖరారు చేసారు. రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ విషయానికొస్తే..  బ్రిటిష్ ప్రభుత్వంలపై కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కట్టలు తెచ్చుకున్న రౌద్రంతో వీళ్లిద్దరు కలిసి చేయాలనుకున్న రణం. ఆ యుద్ధంలో ఈ యోధులు అర్పించిన రుధిరం. అంటే రక్తం చిందించడం అనే అర్ధంతో ఈ సినిమా టైటిల్ పెట్టారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్.. అల్లూరి, కొమరం భీమ్‌లకు గురువుగా జ్ఞానపదేశం చేసే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అజయ్ దేవ్‌గణ్ పాత్రనే ఈ సినిమా కథకు కీలకం అని చెబుతున్నారు.  ఇక ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్ కోసం రాజమౌళి ఒక స్పెషల్ ట్రీట్‌ను రెడీ చేసినట్టు సమాచారం. ఈ టీజర్‌తో గూస్ బంప్స్ కావడం ఖాయం అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నట్టు సమచారం.

after rrr movie jr ntr taking decision over every film on his brother nandamuri kalyan ram production,jr ntr,jr ntr rrr,rrr,roudram ranam rudhiram,jr ntr kalyan ram,kalyan ram ntr arts,jr ntr helps to kalyan ram,ntr30,jr ntr,jr ntr twitter,jr ntr trivikram,trivikram,trvikram next movie wiht naga chaitanya or nani,sanjay dutt, ntr trivikram movie,trivikram,trivikram srinivas,jr ntr and trivikram movie updates,ntr,ntr movies,aravinda sametha movie,unior ntr and pooja hegde at trivikram movie,jr ntr and trivikram movie latest updates,jr ntr and trivikram movie title reason revealed,jr ntr and trivikram movie title,jr ntr and trivikram movie latest news,jr ntr and trivikram movie, ఎన్టీఆర్ త్రివిక్రమ్, పూజా హెగ్డే, సంజయ్ దత్, నాగ చైతన్యతో లేదా నానితో త్రివిక్రమ్ మూవీ,త్రివిక్రమ్ మూవీ నాని,నాగ చైతన్య త్రివిక్రమ్,ఎన్టీఆర్ త్రివిక్రమ్,ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్,కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్
ఎన్టీఆర్ Photo : Twitter


మరోవైపు ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో నెక్ట్స్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు సమచారం. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అదే టైటిల్‌ను ఈ సినిమాకు పెడతారా లేకపోతే.. వేరే ఏదైనా పెడతారా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు కూడా ఆర్ఆర్ఆర్ తరహాలో పాన్ ఇండియా లెవల్‌లో త్రివిక్రమ్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే సంజయ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఈ పాత్రను త్రివిక్రమ్‌ డిజైన్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే రోజున ప్రశాంత్ నీల్ సినిమా కూడా అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. అటు ఎన్టీఆర్, సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పై ప్రకటన ఉండే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 17, 2020, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading