తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న ఫాలోయింగ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసత్వాన్ని ఆయన తనయుడు బాలకృష్ణ ముందుకు నడిపించాడు. మూడో తరంలో నందమూరి వారసత్వాన్ని భుజాలపై మోస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఇపుడున్న యంగ్ హీరోల్లో తనకంటూ స్పెషల్‌గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని సినిమా సినిమాకు తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు తారక్. ఇక నందమూరి హీరోల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు వీళ్లిద్దరు ఒకే తెరపై కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కూడా అనుకున్నారు. అదే ‘జనతా గ్యారేజ్’. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. అంటూ ఒకవైపు పాడైన వాహనాలను, మరోవైపు అన్యాయం చేసే వ్యక్తులను సరైన దారిలో పెడతాడు ఎన్టీఆర్. 2016లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ప్రకృతి ప్రేమికుడు ఆనంద్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు తారక్. అంతేకాదు ఈ చిత్రంలో ఎన్టీఆర్‌లో దాగిఉన్న మరో నటుడు బయటకు వచ్చాడు. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో మోహన్ లాల్ నటించాడు. మెకానిక్ సత్యం పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐతే.. ఈ పాత్రలో బాలకృష్ణ నటిస్తే.. ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందట ఈ సినిమా దర్శక, నిర్మాతలకు.

బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే.. అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ నటిస్తారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. జనతా గ్యారేజ్‌లో మెకానిక్ సత్యం పాత్రకు బాలయ్య ఎందుకు తీసుకోలేదు అని కొరటాల శివను అడిగినపుడు.. తారక్, బాలకృష్ణ కాంబినేషన్ అంటూ అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ కాంబినేషన్లో చిత్రం అంటే వాళ్లిద్దరి మధ్య సీన్స్ ఎలా ఉంటాయి అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తారు కానీ... కథ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇది కథా బలం ఉన్న సినిమా. ఐనా నందమూరి హీరోలు కలిసి నటిస్తే చూడాలనేది అభిమానుల కల. దానికి ‘జనతా గ్యారేజ్’ సరైన సినిమా కాదనేది నా అభిప్రాయం. అందుకే ఈ చిత్రంలో బాలకృష్ణ బదులు మోహన్ లాల్‌ను తీసుకున్నాము. ఒకవేళ బాలకృష్ణ నటిస్తే.. అందులో బాలయ్య పాత్రను ఆయన ఇమేజ్‌కు తగ్గట్టు తిరిగి రాసుకోవాలి. దీంతో నేను చెప్పాలకున్న కథ దెబ్బతింటుంది. అందుకే ఆయన్ని ఈ సినిమా కోసం ఒద్దనుకున్నాం. భవిష్యత్తులో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి కలయికలో భవిష్యత్తులో సినిమా రావచ్చేమో. ఏదైనా జరగొచ్చు అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు కొరటాల శివ.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 16, 2020, 09:15 IST