ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ అదేనా.. అందుకోసం కొత్తగా ఏం చేస్తున్నాడంటే..

జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)

అవును జూనియర్ ఎన్టీఆర్ ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు మరోవైపు ఏపీలో జరిగే రాజకీయా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

 • Share this:
  అవును జూనియర్ ఎన్టీఆర్ ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు మరోవైపు ఏపీలో జరిగే రాజకీయా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు వైసీపీ, మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ తట్టుకోలేకపోతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కాపాడానికి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని అన్నగారు అభిమానులతో పాటు టీడీపీలోని మెజారిటీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎందుకంటే.. ఎన్టీఆర్ అభినయం, ఆహార్యంలో తాతకు తగ్గ మనవడని ఎపుడో నిరూపించుకున్నాడు. అంతేకాదు 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తన వాగ్దాటితో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇక నందమూరి మూడో తరంలో ఎన్టీఆర్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాడు జూనియర్. సినిమాల్లో మాదిరే  రాజకీయాల్లోను తాతగారి వారసత్వం అందుకోవాలని  అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎన్టీఆర్‌లా ఉన్న జూనియర్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తారక్ అభిమానులు.

  jr ntr master plan for political entry here are the details,Jr ntr,sr ntr,jr ntr sr ntr,jr ntr politics,jr ntr political entry,rrr,rrr movie,jr ntr sr ntr,jr ntr play sr ntr charecter,balakrishna jr ntr,jr ntr jayalalithaa,kanagana jr ntr sr ntr jayalalithaa,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా,సీనియర్ ఎన్టీఆర్ జయలలిత,కంగనా ఎన్టీఆర్ జయలలిత బయోపిక్,బాలకృష్ణ నందమూరి తారక రామారావు జయలలిత కంగనా రనౌత్ తారక్,తాత,పాలిటిక్స్‌లో తారక్,పాలిటిక్స్‌లో ఎన్టీఆర్
  తాతను పోలిన గెటప్‌లో జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫిక్స్ చిత్రం (Facebook/Photo)


  ఇప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలంటూ పలువురు అభిమానులు.. ఆయన ప్రమేయం లేకుండానే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  ‘టీమ్ తారక్ ట్రస్ట్’ పేరుతో ఆయన అభిమానులు కొందరు కలిసి ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసారు. ఈ ట్రస్ట్ నాలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిన్నపిల్లలకు చదువు కోవడానికి పుస్తకాలు, పౌష్టికాహారంతో బాధపడుతున్న వారికి సరైన ఆహారాన్ని ఈ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని ఎన్టీఆర్ అభిమానులు.. ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా ? లేకపోతే మాములుగానే చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే అభిమానులు రోజు రోజుకు పెరుగుతున్నారు. మరి అభిమానుల కోరికను మన్నించి జూనియర్ త్వరలో రాజకీయ అరంగేట్రం చేస్తాడా లేదా అనేది చూడాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: