సెలబ్రిటీలు ఏం చేసిన వార్తే. ఏ డ్రెస్ వేసుకున్న వైరలే. తాజాగా ప్రముఖ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ప్రత్యేక డ్రెస్సులో కనిపించారు. ఆయన కాషాయం డ్రెస్సులో ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో ఎన్టీఆర్ ప్రత్యేక దీక్షలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం హనుమాన్ జయంతి అయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి మాల ధరించినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత సక్సెస్ పార్టీలో తప్ప బయట ఎక్కడా ఎన్టీఆర్ కనపడలేదు. తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ఎన్టీఆర్ మాలలో ఉన్నాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.
ఎన్టీఆర్ కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన పూర్తి కొత్తగా కనిపిస్తున్నారు. ఓ గుడిలో అభిమానులతో ఫోటో దిగగా, దాన్ని వారు సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే మొక్కులో భాగంగా ఫస్ట్ టైమ్ మాల ధరించబోతున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయన ఈ మాల ధరించారని టాక్. హనుమాన్ జయంతి సందర్భంగానే ఆయన మాల ధరించడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.21 రోజులపాటు ఎన్టీఆర్ ఈ దీక్షలో ఉండబోతున్నట్టు సమాచారం. అనంతరం తన కొత్త సినిమాని ప్రారంభించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
అయితే ఇలా చాలా మంది ప్రముఖులు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారు. కొంతమంది శివ మాల, వేంకటేశ్వరస్వామి మాల, ఆంజనేయస్వామి మాల కూడా వేసుకుంటారు. వారు ఆ మాలలో ఉన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రామ్ చరణ్ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. ఇటీవలే చరణ్, తారక్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ హిట్ సాధించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత చరణ్ రెగ్యులర్ గా మీడియాలో కనపడుతున్నాడు. తన కొత్త సినిమాలకు సంబంధించిన షూట్ కూడా మొదలుపెట్టేశాడు చరణ్. ఇప్పుడు కూడా చరణ్ మాలలోనే ఉన్నాడు.
సెలబ్రిటీలు కూడా దీక్షలు వేస్తూ ఉంటారు. ఎక్కువగా మన స్టార్స్ అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటారు. తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ స్టార్లు చాలా మంది అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటారు. చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, ధనుష్, శింబు, వివేక్ ఒబెరాయ్, అజయ్ దేవగణ్…వీరంతా ప్రతీ ఏడాది అయ్యప్ప మాల ధరిస్తుంటారు. కొందరు శివమాల వేసుకుంటారు. ఇంకొందరు ఆంజనేయస్వామి దీక్ష చేపడతారు. ఇలా ఎవరికి వారు తమకు ఇష్టమైన దైవాన్ని స్మరిస్తూ.. కొన్నిరోజుల పాటు దీక్ష చేస్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Ram Charan, RRR