Jr NTR - Ram Charan: ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమిని టీవీలో త్వరలో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో ప్రసారం కానుంది. ఎపుడో పట్టాలెక్కాల్సిన ఈ రియాలిటీ షో కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. లేకపోతే ఈ పాటికీ టీవీల్లో ఈ షో టెలికాస్ట్ అయ్యేది. ఈ షో ఆగష్టు 16 నుంచి టీవీలో ప్రసారం కానున్నట్టు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలుడనుంది. ఐతే.. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉంటే.. హాట్ సీట్‌లో రామ్ చరణ్ అలరించనున్నారు. ఇప్పటికే ఈ రామ్ చరణ్ గెస్ట్‌గా ఈ షో షూట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ సంధించిన ప్రశ్నలకు రామ్ చరణ్ అంత తెలివిగా సమాధానాలు ఇచ్చి ఈ షో నుంచి దాదాపు రూ. 25 లక్షల వరకు గెలిచినట్టు సమాచారం. వచ్చిన ఈ మొత్తాన్ని ఓ ఛారిటీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో టీవీలో ప్రసారం కానున్న ఈ షో టీఆర్పీ రేటింగ్ అదిరిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ ఎపిసోడ్‌తో పాటు ఎన్టీర్ 16 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తైయిందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఉక్రెయిన్ లో RRR షూటింగ్ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత కొరటాల శివ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రియాలిటీ షోలతో తన కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసారు.
ఆ తర్వాత వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌కు హోస్ట్‌గా కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ ప్లేస్‌లో సెకండ్ సీజన్‌ను నాని హోస్ట్ చేస్తే.. మూడో, నాల్గో సీజన్లను నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోను రెడీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ప్రోగ్రామ్‌తో ప్రతి ఇంటిని పలకరించనున్నారు.
‘ఎవరు మీలో కోటీశ్వురులు’ ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు రూ. 1.2 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీజన్ 1 కోసం 30 ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సీజన్‌లోనే రూ. 30 కోట్లకు పైగా తారక్ పారితోషికంగా తీసుకోబోతున్నాడన్నమాట. ఐతే.. ఈ షో విషయంలో ఎన్టీఆర్ ముందు పెద్ద టార్గెట్ ఉంది. ఇప్పటి వరకు స్టార్ మా ఛానెల్‌లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ప్రసారం అయ్యాయి. నాగార్జున హోస్ట్ చేసిన మూడు సీజన్లు సక్సెస్ అయితే.. చిరంజీవి చేసిన సీజన్ 4 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్ వాళ్లు ఈ ప్రోగ్రామ్ పై పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. దాంతో జెమిని టీవీ వాళ్లు ఎన్టీఆర్‌తో ఈ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసారు. మరి ఎన్టీఆర్ తన యాంకరింగ్‌తో ఈ షోకు హైయ్యెస్ట్ టీఆర్పీ సాధించడంలో సక్సెస్ అవుతారా ? లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్‌లో జెమిని టీవీ 4 ప్లేస్‌లో ఉంది. ఈ ఛానెల్‌లో సినిమాలు మినహా ఏ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి ఈ షోను హోస్ట్ చేయడంతో ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ హోస్టింగ్‌ను ఆ ఇద్దరు హీరోలతో కంపేర్ చేసి పోలుస్తారు. ఎన్టీఆర్ తన హోస్టింగ్‌తో నాగార్జున, చిరంజీవిని మైమరిపిస్తే కానీ ఈ షో సక్సెస్ కానట్టు లెక్క. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే బిగ్‌బాస్ హోస్ట్‌గా మెప్పించిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఈ షోను రక్తి కట్టించడం తారక్ కు పెద్ద పని కాదంటున్నారు చాలా మంది. అంతేకాదు ఈ షో బిగ్‌బాస్, కార్తీక దీపం వంటి సీరియల్స్ టీఆర్పీ ని కూడా క్రాస్ చేయాలి. మొత్తంగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ షోతో ఎన్టీఆర్ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తారనేది చూడాలి. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కంటే ముందు తారక్ ముందు పెద్ద టార్గెట్ ఉందన్న మాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Evaru Meelo Koteeswarulu, Jr ntr, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood