సమీరా రెడ్డి ఫైల్ ఫోటో
పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా కుటుంబమే లోకంగా బ్రతుకుతున్న సమీరా రెడ్డి.. ఈ మధ్యకాలంలో తన ప్రెగ్నేన్సీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలిచింది. అంతేకాదు తనకు మొదటిసారి ప్రెగ్నేస్నీ అపుడు 102 కిలోల వరకు బరువు పెరిగినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇపుడు రెండో బిడ్డకు జన్మనివ్వడానిక రెడీ అయ్యారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి సోషల్ మీడియా ద్వారా తన ఉనికి చాటుకుటుంది.అంతేకాదు తాజాగా సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై పెద్ద బాంబే పేల్చింది. రీసెంట్గా సమీరా రెడ్డి తమిళ మీడియాతో మాట్లాడుతూ..సినిమా పరిశ్రమలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు ఇచ్చి మహిళలను సెక్సువల్ హారాస్‌మెంట్‌కు గురిచేసే పద్దతి మారాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలను ఒక వస్తువుగా చూడటం సరికాదన్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే పూర్తిగా ప్రక్షాళన జరగాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఇలాంటి ఎన్నో ఫేస్ చేశానన్నారు.

సమీరా రెడ్డి ఫైల్ ఫోటో
నటిగా ఓ రేంజ్‌కు చేరుకున్న తర్వాత కూడా నాకు సెక్సువల్ వేధింపులు తప్పలేదన్నారు. అంతేకాదు అవకాశం ఇచ్చిన తర్వాత పక్కలోకి రమ్మన్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే మహిళలకు ఇలాంటి పనులు చేయక తప్పడం లేదు. ఇలా అయితే కష్టమని సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పానన్నారు. మహిళలకు వాళ్ల టాలెంట్ ఆధారంగా అవకాశాలు రావాలన్నారు. ఇపుడిపుడే మీటూ ఉద్యమం కారణంగా పరిస్థితులో మార్పు వచ్చిందన్నారు. అప్పట్లో సమీరా రెడ్డి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అశోక్’తో పాటు ’నరసింహుడు’ సినిమాల్లో నటించింది. అంతేకాదు చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవా’ సినిమాలో కథానాయికగా నటించింది కూడా. ఆ తర్వాత ఈ భామను అందరు మరిచిపోయారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది.
First published:
May 7, 2019, 6:03 PM IST