ఆ విషయంలో బాబాయి బాలయ్యపై పై చేయి సాధించిన అబ్బాయి ఎన్టీఆర్..

అవును ఆ విషయంలో బాబాయి బాలకృష్ణపై అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ పై చేయి సాధించాడు.  వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 14, 2020, 9:51 AM IST
ఆ విషయంలో బాబాయి బాలయ్యపై పై చేయి సాధించిన అబ్బాయి ఎన్టీఆర్..
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Balakrsihna)
  • Share this:
అవును ఆ విషయంలో బాబాయి బాలకృష్ణపై అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ పై చేయి సాధించాడు.  వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకటి అఘోరా పాత్ర అయితే.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర. ఈ సినిమాలో బాలయ్యకు ఢీ కొట్టే విలన్ పాత్రలో పలువురు హీరోల పేర్లు పరిశీలించారు. అందులో సంజయ్ దత్ పేరు కూడా అనుకున్నారు. కానీ సంజయ్ దత్ మాత్రం కేజీఎఫ్ 2 షూటింగ్‌తో పాటు మరో రెండు మూడు సినిమాలు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రంలో విలన్‌గా చేయలేనని చెప్పాడట. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను ఈ సినిమాలో ఒక విలన్‌గా ఆల్రెడీ శ్రీకాంత్‌ను తీసుకున్నారు. మరో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం బోయపాటి శ్రీను  అన్వేషణ చేస్తున్నట్టు సమాచారం.

balakrishna boyapati srinu movie not accepted sanjay dutt but jt ntr trivikram movie accepted sanju baba,Jr ntr,balakrishna,jr ntr balakrishna nandamuri,sanjay dutt,ntr jr sanjay dutt trivikram,sanjay dutt boyapati srinu balakrishna,sanajay dutt accepted jr ntr trivikram movie,sanjay dutt not accepted balakrishna boyapati srinu movie,balayya,nbk,rrr,rrr movie,jr ntr sr ntr,jr ntr play sr ntr charecter,balakrishna jr ntr,jr ntr jayalalithaa,kanagana jr ntr sr ntr jayalalithaa,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా,సీనియర్ ఎన్టీఆర్ జయలలిత,కంగనా ఎన్టీఆర్ జయలలిత బయోపిక్,బాలకృష్ణ నందమూరి తారక రామారావు జయలలిత కంగనా రనౌత్ తారక్
బాలకృష్ణ,సంజయ్ దత్,జూ ఎన్టీఆర్ (File/Photos)


మరోవైపు సంజయ్ దత్.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో విలన్‌గా యాక్ట్ చేసినట్టు సమాచారం. ‘అయినను పోయి రావలే హస్తినకు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే విలన్‌ పాత్రలో మరో పవర్‌ఫుల్ హీరో లాంటి పాత్ర ఉంటేనే హీరో పాత్ర పండుతుంది. ఈ సినిమాలో సంజయ్ దత్.. ఢిల్లీలో ఉంటూ రాజకీయం చేసే పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు మరో ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ విలన్‌లు ఇందులో నటించే అవకాశం ఉందట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన సినిమాలన్ని ప్యాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకొనే చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ కోవలోనే సంజయ్ దత్ వంటి మాస్ హీరో తన సినిమాలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో సంజూ బాబాను సంప్రదించాడట. ఈ సినిమాలో యాక్ట్ చేసేందకు సంజయ్ దత్‌కు భారీగానే ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు సంజయ్ దత్‌ను కలిసి ఈ సినిమా స్టోరీ చెప్పారట. ఇక సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో తన పాత్ర నచ్చడంతో పాటు ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కనుండటంతో ఈ సినిమాలో  యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తానికి సంజూ బాబా విషయంలో బాబాయి బాలయ్యపై అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ పై చేయి సాధించినట్టైయింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 14, 2020, 9:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading