అడవిలో అంత పనిచేసిన ఎన్టీఆర్.. ఆశ్యర్యపోతున్న అభిమానులు..

RRR | ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో  రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. 

news18-telugu
Updated: February 14, 2020, 1:42 PM IST
అడవిలో అంత పనిచేసిన ఎన్టీఆర్.. ఆశ్యర్యపోతున్న అభిమానులు..
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ (ఫ్యాన్ మేడ్ పోస్టర్ కమ్ ట్విట్టర్ ఫోటోస్)
  • Share this:
ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో  రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రాజమౌళి ఎంత కంట్రోల్ చేసినా.. సినిమాలోని సన్నివేశాలు లీకైవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్.. పులితో ఫైట్ చేసే సన్నివేశం లీకైన సంగతి తెలిసిందే కదా. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)


తాజాగా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ చిత్రంలో షూటింగ్ సందర్భంగా నిజమైన పులిని వాడారని తెలుస్తోంది. కొమరం భీమ్ పాత్రను వీరత్వంతో కూడినదిగా చూపించేందుకు రాజమౌళి నిజమైన పులిని వాడినట్టు చెబుతున్నారు. కట్టివేసిన పులితో పాటు ట్రైనర్‌ను దగ్గర పెట్టుకొని ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాలో పది నిమిషాల ఈ సన్నివేశానికి గూస్ బంప్స్ పక్కా అని చెబుతున్నారు.  ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ చరణ్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు