మహేష్, చరణ్‌లకు ఫిట్ నెస్ ఛాలెంజ్‌ విసిరిన ఎన్టీఆర్‌!

news18
Updated: June 1, 2018, 4:09 AM IST
మహేష్, చరణ్‌లకు ఫిట్ నెస్ ఛాలెంజ్‌ విసిరిన ఎన్టీఆర్‌!
  • News18
  • Last Updated: June 1, 2018, 4:09 AM IST
  • Share this:
ఇప్పుడు  దేశ వ్యాప్తంగా ఫిట్‌నెస్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’  ఛాలెంజ్ ను దేశంలోని చాలా మంది సెలబ్రిటీలు స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’  చాలెంజ్‌లో సెలబ్రిటీలు  హృతిక్‌ రోషన్‌, విరాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌‌, దీపికా పదుకొనే, అఖిల్ అక్కినేని, నాగ చైతన్య, సమంత, రకుల్ ప్రీత్ తదితరులు జిమ్‌లో కసరత్తులు చేసే ఫోటోలు, వీడియోలనే షేర్ చేశారు.

రీసెంట్ గా  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ .. జిమ్‌లో  తాను ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఫోటోలను  సోషల్‌మీడియాలో పెట్టి తారక్, సూర్య, పృథ్వీరాజ్‌లను కూడా ఈ ఛాలెంజ్‌కు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.



ఆయన ఛాలెంజ్‌ను స్వీకరించిన తారక్‌..  జిమ్‌లో వర్క్ ఔట్స్  చేస్తున్న  వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాను మామూలుగానే తన జిమ్  ట్రైనర్‌ పరివేక్షణలో  రెగ్యులర్ గా  వ్యాయామం చేస్తానని చెప్పాడు.

తారక్ సక్సెస్ ఫుల్  ఛాలెంజ్ ని పూర్తి చేసిన  తారక్  ఇప్పడు  మహేశ్‌ బాబు, నందమూరి కల్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ చేశారు. అయితే, రామ్‌ చరణ్‌ తేజ్‌కు ట్విట్టర్‌ అకౌంట్‌ లేకపోవడంతో.. తన ఛాలెంజ్‌ విషయాన్ని చెర్రీతో చెప్పాలని ట్విట్టర్‌లో ఉపాసనను కోరారు. మరి మహేష్, చరణ్‌లు ఈ ఛాలెంజ్‌ని ఎలా స్వీకరిస్తారో చూడాలి మరి.

Published by: Sunil Kumar Jammula
First published: June 1, 2018, 4:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading