బాబాయికి అండగా అబ్బాయి...నాగబాబుపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం...

బాలయ్య,ఎన్టీఆర్,నాగబాబు (File/Photos)

తాజాగా నాగబాబు.. బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐతే.. నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 • Share this:
  నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి సమాధి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కరోనా నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంలో జరిపిన చర్చలపై మాట్లాడాల్సిందిగా కోరగా.. ఈ విషయమై బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇండస్డ్రీ పెద్దలు తనను పిలవనే లేదనే విషయాన్ని చెప్పారు. ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ తనకు తెలియవని.. హైదరాబాద్‌లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తననెవ్వరూ పిలవలేదని.. పిలవకపోతే తనకు ఎలా తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలయ్య. ఈయన చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తన యూట్యూబ్ చానెల్ వేదికగా తప్పు పట్టారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకో అంటూ కౌంటర్ వేసాడు. ఇండస్ట్రీలో జరిగే మీటింగ్స్‌కు ఎవరిని పిలవాలో.. ఎవరిని పిలవద్దో వారికి తెలుసన్నాడు. తాజాగా నాగబాబు.. బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐతే.. నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  jr ntr fires on mega brother nagababu due to his uncle balakrishna issue,balakrishna,naga babu,jr ntr,jr ntr balakrishna naga babu,jr ntr serious on naga babu,jr ntr twitter,naga babu twitter,naga babu vs balakrishna,naga babu controversy,naga babu balakrishna controversy,naga babu counter attack on balakrishna,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్,బాలకృష్ణ నాగబాబు,జూనియర్ ఎన్టీఆర్ సీరియస్,నాగబాబు పై జూనియర్ సీరియస్
  బాలయ్య,ఎన్టీఆర్,నాగబాబు (File/Photos)


  అప్పట్లో బాలయ్య ఎవరో నాకు తెలియదు అంటూ చెప్పిన నాగబాబు.. ఇప్పుడు ఏ బాలయ్యను క్షమాపణ చెప్పమన్నది ఏ బాలయ్యనో చెప్తే అపుడు రియాక్ట్ అవుతాం అంటూ నాగబాబుపై కౌంటర్ వేస్తున్నారు. ఇక బాబాయి, నాగబాబు ఇష్యూపై ఎన్టీఆర్ బాగా అప్‌సెట్ అయినట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్‌‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు కూడా. మరోవైపు బాలయ్యకు చిరంజీవితో మంచి అనుబంధమే ఉంది. అంతేకాదు అప్పట్లో నాగబాబు తనను అవమానించేలా వీడియోలు చేసినా.. అవేమి పట్టించుకోకుండా చిరంజీవితో బాలయ్య సన్నిహితంగా మెలుగుతూనే ఉన్నారు.  మరోవైపు మెగా ఫ్యామిలీ హీరలైన చిరంజీవి, రామ్ చరణ్ కూడా నిన్నటి నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో తమ ఫ్యామిలీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య విలేఖరుల సమావేశంలో ఏదో మాట్లాడటం.. నాగబాబు దానికి కౌంటర్ ఇవ్వడం వంటిని ఇరు అభిమానుల మధ్య మనస్పర్థలు క్రియేట్ చేసేలా ఉన్నాయని జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. రామ్ చరణ్‌తో మాట్లాడి.. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఇలా రచ్చ కెక్కడం ఏమి బాగోలేదు అంటూ నాగబాబు ఇష్యూపై కాస్త సీరియస్ అయినట్టు  సమాచారం. మొత్తంగా బాబాయి బాలయ్య విషయంలో  నాగబాబు ప్రవర్తించిన విధానం చూసి  జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఎక్కువగానే ఫీలయైనట్టు తెలుస్తోంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: