రామ చరణ్ బర్త్ డే కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పెషల్ ట్రీట్...

rrr సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్

rrr | ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లిద్దరు టాలీవుడ్ నుంచి పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోలు. వీళ్లిద్దరు ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి మొదటిసారి  నటిస్తున్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • Share this:
  ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లిద్దరు టాలీవుడ్ నుంచి పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోలు. వీళ్లిద్దరు ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి మొదటిసారి  నటిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్  చరణ్..అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ ఈ నెల మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ .. చరణ్ పుట్టినరోజైన ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించి ఏదైనా స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ క్యాంపెయిన్ మొదలుపెట్టబోతున్నట్టు చెబుతున్నారు. ఈ రకంగా ఒక హీరో కోసం మరో హీరో అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం.

  RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
  RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)


  ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా.. ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కు పండగే కాబట్టి.. చరణ్ పుట్టినరోజు ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సారి ప్రత్యేకంగా నిలవనుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో పది భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈచిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: