Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 11, 2018, 7:17 AM IST
ఎన్టీఆర్
"అరవింద సమేత వీరరాఘవ" ఆకాశమే హద్దుగా విడుదలైంది. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే షోలు మొదలు కావడంతో నందమూరి అభిమానులకు పండగ వారం రోజుల ముందే వచ్చేసింది. పైగా ఎన్టీఆర్ నటనతో పాటు సినిమా కూడా బాగుందనే టాక్ రావడంతో వాళ్ల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.
ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్స్ ముందు కోలాహలం చేస్తున్నారు. ముఖ్యంగా గుంటూర్, నెల్లూర్ లాంటి ఏరియాల్లో అయితే ఉదయం నుంచే బెనిఫిట్ షోలు పడ్డాయి. దాంతో వాళ్లు అక్కడ బాణాసంచా పేల్చి ఎన్టీఆర్ కటౌట్స్కు పాలాభిషేకాలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. కర్ణాటకలో కూడా నందమూరి అభిమానుల రచ్చ మామూలుగా లేదు.
ఓవర్సీస్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా అరవింద సమేత టీ షర్ట్స్ వేసుకుని అభిమానం చూపించారు. ఇంటా బయటా ఇటు అటూ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇప్పుడు అరవింద సమేత మేనియా నడుస్తుంది. రెగ్యులర్ షోస్ మొదలయ్యే నాటికి సినిమా టాక్ ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయేలా కనిపిస్తుంది. ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తోనే సినిమా ఓపెన్ అయింది.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 11, 2018, 7:17 AM IST