Home /News /movies /

JR NTR EMOTIONAL POST AND SPECIAL THANKS TO HIS FANS SLB

Jr Ntr: ఆ విషయంలో నన్ను క్షమించండి.. పుట్టిన రోజున ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

Photo Twitter

Photo Twitter

నేటితో 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అయితే వాళ్లందరికీ స్పెషల్ థాంక్స్ చెప్పిన ఎన్టీఆర్.. తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ సందేశం పోస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
ఈ రోజు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు (Jr Ntr Birthday). నేటితో 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారాయన. ఈ సందర్భంగా ఆయన అభిమానుల ట్వీట్లతో సోషల్ మీడియాలో #NtrBirthday హ్యాష్ ట్యాగ్ మోత మోగుతోంది. తమ అభిమాన హీరో బర్త్ డే కావడంతో జనం పెద్ద ఎత్తున ఎన్టీఆర్ (Ntr) ఇంటికి చేరుకున్నారు. గత రాత్రి నుంచే ఎన్టీఆర్ ఇంటి ప్రాంగణం జన సందోహంతో కిటకిటలాడుతోంది. రోడ్లపై కేక్స్ కట్ చేస్తూ ఎన్టీఆర్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్. జై ఎన్టీఆర్ అంటూ అరుపులు, కేకలు పెడుతున్నారు. మరోవైపు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్‌కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో నెట్టింట ఈ రోజంతా ఎన్టీఆర్ నామస్మరణమే కనిపించింది. ఈ నేపథ్యంలో అందరికీ ధన్యవాదాలు (Ntr Thanks to fans) చెబుతూ ఓ లెటర్ రూపంలో ఎమోషనల్ సందేశం పోస్ట్ చేశారు ఎన్టీఆర్.

అభిమానులు చూపించే ప్రేమ ముందు ఏది కూడా ఎక్కువ కాదు అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేసిన లెటర్ ఆన్ లైన్ మాద్యమాలపై వైరల్ అవుతోంది. యంగ్ టైగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు గాను తెలుగు రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో గత రాత్రి నుంచి ఆయన ఇంటి ప్రాంగణంలో ఫ్యాన్స్ కోలాహలం కనిపించింది. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఒకింత ఫ్యాన్స్ అల్లరి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టడం కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్ అభివాదాన్ని చూడాలని కుతూహలంతో వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ రోజు ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో ఎవ్వరినీ కలవలేకపోయారు. తాజాగా విడుదల చేసిన లేఖలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ అభిమానులకు క్షమాపణ చెప్పారు ఎన్టీఆర్.


''నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, తోటి నటీనటులు అందరకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. సుదూర ప్రాంతాల నుండి ఫ్యాన్స్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు చూపించే ఈ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అభిమానం, ప్రేమ, ఆశీస్సుల ముందు ఏదీ ఎక్కువ కాదు. ఈ రోజు నేను ఇంట్లో లేకపోవడం వల్ల ఎవ్వరినీ కలవలేకపోయాను. అందుకు సారీ చెబుతున్నా'' అని ఎన్టీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ చుసిన నందమూరి ఫ్యాన్స్ లవ్ యూ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆయన కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇచ్చి నందమూరి అభిమానులను ఖుషీ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న Ntr30 నుంచి ఓ స్పెషల్ వీడియో వదలగా.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న Ntr31 నుంచి కోర మీసంతో కూడిన ఎన్టీఆర్ పవర్‌ఫుల్ లుక్ రిలీజ్ చేశారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Birthday, Jr ntr

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు