Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 17, 2020, 8:21 PM IST
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Rajamouli)
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. జూనియర్ ఎన్టీఆర్ పేరుకు పెద్దోడే కానీ లోపల మాత్రం చిన్న పిల్లోడు. తనకు కావాల్సిన వాళ్ల దగ్గరే ఆ చిలిపితనం చూపిస్తుంటాడు యంగ్ టైగర్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏంటో తెలిసిన వాళ్లే ఆయన అల్లరిని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే ఒకటి బయటికి వచ్చింది. ఆయనలోని చిలిపితనం ఏ స్థాయిలో ఉంటుందో.. మొండితనం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొండితనం ఇంకాస్త ఎక్కువే. అలాంటి చిలిపి సంఘటన బయటికి వచ్చిందిప్పుడు. అది తెలిసిన తర్వాత వామ్మో ఎన్టీఆర్ అనుకోకుండా ఉండలేరు. ఇప్పుడు జరిగింది కాదిది.. దాదాపు 15 ఏళ్ల కింద ఛత్రపతి షూటింగ్ సమయంలో జరిగింది. ఆ సినిమాలో బాల ప్రభాస్‌గా నటించిన మనోజ్ నందం అప్పుడు జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఛత్రపతి షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సడన్‌గా లొకేషన్‌కు వచ్చాడని చెప్పాడు మనోజ్.

ప్రభాస్ రాజమౌళి (Prabhas Rajamouli)
అప్పుడే తను తొలిసారి తారక్‌ను చూడటం అని.. ఆయన అల్లరిని కూడా అప్పుడే చూడటం అని చెప్పాడు. ఛత్రపతి షూటింగ్ వేగంగా జరుగుతున్న సమయంలో వచ్చి.. ఒకరోజు ప్యాకప్ చెప్పించాడని చెప్పుకొచ్చాడు మనోజ్. అసలేం జరిగిందంటే ఓ బంగ్లాలో ఛత్రపతి షూటింగ్ జరుగుతున్నపుడు జూనియర్ అక్కడికి వచ్చాడు. వచ్చిన వాడు ఊరికే ఉండకుండా రాజమౌళిని లాక్కెళ్లిపోయాడు. దానికి ముందు రోజు ఓ సినిమా చూసాడు జూనియర్ ఎన్టీఆర్. అది ఆయనకు బాగా నచ్చింది.. వెంటనే ఆ సినిమాను రాజమౌళికి కూడా చూపించాలనుకున్నాడు.

రాజమౌళి,ఎన్టీఆర్ (Instagram/Photo)
అంతే వెంటనే ఛత్రపతి లొకేషన్‌కు వచ్చి అక్కడ్నుంచి జక్కన్నను తీసుకెళ్లిపోయాడు జూనియర్. వద్దని చెప్తున్నా వినలేదు.. షూటింగ్ ఉంది రానని మొత్తుకున్నా పట్టించుకోలేదు.. నన్ను కాదని షూటింగ్ ఎలా చేస్తావో చూస్తానంటూ లొకేషన్ మధ్యలో కూర్చున్నాడు జూనియర్. దాంతో చేసేదేం లేక రాజమౌళి ప్యాకప్ చెప్పి సినిమాకు వెళ్లిపోయాడు. అలా ఆ రోజు ఛత్రపతి షూటింగ్ ఎన్టీఆర్ వల్ల ఆగిపోయింది. ఆ రోజు తారక్ అల్లరి చూసి తాను షాక్ అయ్యానని చెప్పాడు మనోజ్ నందం. నిజమే.. ఎందుకంటే జూనియర్‌తో బాగా పరిచయం ఉన్న వాళ్లకు మాత్రమే ఆయన అల్లరి గురించి పూర్తి అవగాహన ఉంటుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 17, 2020, 8:21 PM IST