ఆ ఇద్దరు టాప్ స్టార్లకు... జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో విందు

ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఈ టాప్ స్టార్స్ ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చారు.

news18-telugu
Updated: October 2, 2019, 3:56 PM IST
ఆ ఇద్దరు టాప్ స్టార్లకు... జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో విందు
జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్... ఫ్రెండ్లీ నేచర్. అందరితో ఇట్టే కలిసిపోతాడు. ఇక చెర్రీ కూడా జూనియర్‌కు మంచి స్నేహితుడు. జూనియర్‌కు టాలీవుడ్‌లోనే కాదు... బాలీవుడ్, శాండిల్ వుడ్ స్టార్లతో కూడా మంచి స్నేహబంధాలు ఉన్నాయి. దీంతో ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రముఖ స్టార్లకు తన ఇంటికి ఆహ్వానించాడు. అంతేకాదు వారిద్దరికి మరిచిపోలేని ఆతిథ్యం కూడా ఇచ్చాడంట. ఈ వార్త సోషల్ మీడియాతో పాటు.. టాలీవుడ్‌లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆ ఇద్దరు టాప్ హీరోలు మరెవరో కాదు.. కేజీఎఫ్‌తో ఇండియాలోనే... స్టార్ హీరోగా పేరుతెచ్చుకున్న యాష్, మరొకరు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. యాష్ ఈ సినిమాలో హీరో. షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన వీరిద్దర్నీ ఎన్టీఆర్ కలుసుకున్నాడు. అంతేకాదు తన ఇంటికి కూడా భోజనానికి ఆహ్వానించాడు.

జూనియర్ కోరిక మన్నించిన వీరిద్దరూ సోమవారం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారట. సౌత్ ఇండియన్ డిషెస్ తో సంజయ్ దత్ కు అద్భుత రుచులు సిద్దం చేశాడట ఎన్టీఆర్. జూనియర్ చేసిన అతిధి మర్యాదకు ఫిదా అయిన సంజయ్ దత్ ... తన ఇంటికి కూడా జూనియర్‌ను తప్పకుండా రావాలని ఆహ్వానించాడట. ఈసారి ఎప్పుడైనా ముంబయ్ వచ్చినప్పుడు తన ఇంటి ఆతిథ్యం కూడా స్వీకరించాల్సిందిగా కోరాడట సంజయ్ దత్.
First published: October 2, 2019, 3:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading