కంగ్రాట్స్ బావా.. అల్లు అర్జున్‌పై స్టార్ హీరో ప్రశంసలు

సంక్రాంతి రేసులో తామే విన్నర్ అంటూ మరో ప్రొమోను విడుదల చేసింది 'అల వైకుంఠపురములో' చిత్ర యూనిట్. వాళ్లకి కరెక్ట్ మొగుడిని నేను తగిలిస్తా కదా.. అనే డైలాగ్‌తో ఈ టీజర్‌ను వదిలారు.

news18-telugu
Updated: January 12, 2020, 9:39 PM IST
కంగ్రాట్స్ బావా.. అల్లు అర్జున్‌పై స్టార్ హీరో ప్రశంసలు
అల వైకుఠపురములో అల్లు అర్జున్
  • Share this:
సంక్రాంతి పండగ వేళ సినిమా థియేటర్లు కళకళలాడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడంతో సినిమా హాళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన రజినీకాంత్ 'దర్బార్', మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకొని వసూళ్ల మోత మోగిస్తున్నాయి. ఇక ఆదివారం విడుదలైన అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మూవీకి కూడా మంచి టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు టాలీవుడ్ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్విటర్ వేదికగా అల్లు అర్జున్‌కు అభినందనలు తెలిపారు. 'కంగ్రాట్స్ బావా'.. అంటూ ట్వీట్ చేశారు. దానికి అల్లు అర్జున్ కూడా.. 'బావా థ్యాంక్స్' అంటూ రిప్లై ఇచ్చారు.
ఇక సంక్రాంతి రేసులో తామే విన్నర్ అంటూ మరో ప్రొమోను విడుదల చేసింది అల వైకుంఠపురములో చిత్ర యూనిట్. వాళ్లకి కరెక్ట్ మొగుడిని నేను తగిలిస్తా కదా.. అనే డైలాగ్‌తో ఈ టీజర్‌ను వదిలారు.

First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు