జూనియర్ ఎన్టీఆర్‌ డ్రైవర్‌కు అంత జీతమా..

నందమూరి మూడో తరం నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా తన సత్తా చూపెడుతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ఒక డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. అతనికి

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 16, 2019, 3:38 PM IST
జూనియర్ ఎన్టీఆర్‌ డ్రైవర్‌కు అంత జీతమా..
Twitter
  • Share this:
నందమూరి మూడో తరం నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా తన సత్తా చూపెడుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస హిట్లతో తన సత్తా చూపెడుతున్నాడు. సినిమాల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే జూనియర్ ఎన్టీఆర్.. తన దగ్గర పనిచేసేవారి విషయంలో అంతే కేర్ తీసుకుంటాడట. ఆ మధ్య కారు డ్రైవింగ్ చేస్తూ తారక్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే కదా. దీంతో అప్పటి నుంచి జూనియర్ ఏదో అత్యవసరమైతే తప్పించి కారు డ్రైవ్ చేయడం లేదు. అందుకే తన కోసం ప్రత్యేకంగా ఒక డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. తండ్రి హరికృష్ణ, పెద్దన్న జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో డ్రైవర్ విషయంలో ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడట.దాంతో ఎంతో అనుభవం ఉన్న ఒక డ్రైవర్‌ను పెట్టుకున్నాడట. ముఖ్యంగా ఎన్టీఆర్ దగ్గర పనిచేసే డ్రైవర్ ఇంత వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదట. అంతేకాదు అతనికి మద్యం అలవాటు కూడా లేదని చెబుతున్నారు.  అందుకే అతనికి నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఇస్తున్నట్టు టాక్. ఏమైనా తన ప్రాణాలను సురక్షితంగా కాపాడే డ్రైవర్‌కు ఎన్టీఆర్ ఆ మాత్రం ఇచ్చుకోవడం సబబే అంటున్నారు తారక్ అభిమానులు. 
Published by: Kiran Kumar Thanjavur
First published: December 16, 2019, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading