హోమ్ /వార్తలు /సినిమా /

Narne Nithin : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో కథానాయకుడు.. శ్రీశ్రీశ్రీ రాజావారుగా వస్తోన్న నార్నే నితిన్..

Narne Nithin : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో కథానాయకుడు.. శ్రీశ్రీశ్రీ రాజావారుగా వస్తోన్న నార్నే నితిన్..

శ్రీశ్రీశ్రీ రాజావారు‌గా ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్ (Twitter/Photo)

శ్రీశ్రీశ్రీ రాజావారు‌గా ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్ (Twitter/Photo)

Jr NTR - Narne Nithin | ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలో వారసులదే హవా నడస్తోంది. తాాజాగా జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

  Jr NTR - Narne Nithin | ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలో వారసులదే హవా నడస్తోంది. ఒక తరం ఇమేజ్ ఆయా హీరోలకు వరంగా మారుతోంది. కానీ ఈ వారసత్వం అనేది కూడా ఒకటి రెండు చిత్రాల వరకే పనికొస్తోంది. ఆ తర్వాత టాలెంట్ లేకపోతే అంతే సంగతులు. ఇక గత కొన్నేళ్లుగా  తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి తనయులే కాదు.. అన్నదమ్ములు కూడా హీరోలుగా, నిర్మాతలుగా రాణించారు. మరోవైపు బావ బామ్మర్ధులు కూడా హీరోలుగా, నిర్మాతలుగా సత్తా చూపెట్టారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ధి నితిన్ చంద్ర కూడా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.  ఈయన తారక్ భార్య లక్ష్మి ప్రణతికి స్వయంగా తమ్ముడు నార్నే శ్రీనివాస రావు తనయుడు. తాజాగా ఇతను ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ పేరుతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు ఈ  రోజు హోళి పండగ సందర్భంగా నితిన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

  పెరిగిన గడ్డంతో రఫ్‌లుక్‌తో ఉన్న నార్నే నితిన్ లుక్ మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాను ‘శతమానం భవతి’, ‘ఎంత మంచివాడవురా’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.

  మరి జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ధిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్న ఇతను బావ తారక్ బాటలో సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్.. మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పలకరించనున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోెసన్స్‌ను జోరుగా చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్‌లో అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్‌కు ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ దాటి 3 మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇలా ఓ ఇండియన్ సినిమాకు జరగడం రికార్డ్ అని అంటున్నారు.

  Ram Charan : పవన్ దర్శకుడితో రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. RRR తర్వాత జెడ్ స్పీడ్‌లో చెర్రీ..

  మొత్తంగా మార్చి 24న రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ మూవీని వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేయనున్నారు. ఈ చిత్రాన్ని 1920 బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో ఇద్దరు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. వీళ్లిద్దరి గురువు పాత్రలో అజయ్ దేవ్‌గణ్ నటించారు. ఇక ఈ సినిమాను యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియోటర్స్ ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా అన్ని భాషల్లో సెన్సార్ పూర్తి చేసుకుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Jr ntr, Narne Nithin, Tollywood

  ఉత్తమ కథలు