• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JR NTR BIRTHDAY WISHES TO RRR DIRECTOR RAJAMOULI AND MANY CELEBRATIES WISHES TO JAKKANNA TA

Rajamouli-Jr NTR: రాజమౌళికి బర్త్ డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్.. జక్కన్నకు భీమ్ స్పెషల్ గిఫ్ట్..

Rajamouli-Jr NTR: రాజమౌళికి బర్త్ డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్.. జక్కన్నకు భీమ్ స్పెషల్ గిఫ్ట్..

రాజమౌళికి తారక్ స్పెషల్ బర్త్ డే విషెష్ (Twitter/Photo)

Rajamouli-Jr NTR |  తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు రాజమౌళి. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. ఈయనకు ఎన్టీఆర్ సహా పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విషెష్ తెలియజేసారు.

  • Share this:
    Rajamouli-Jr NTR |  తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు రాజమౌళి. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి. హీరోయిజాన్ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి కథానాయికుడు ఇమేజ్ ను పెంచే దర్శకధీరుడుగా రాజమౌళి గత 19 యేళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ రోజు ఈయన బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ముఖ్యంగా రాజమౌళికి ఆయన ఆత్మీయ హీరో అయిన ఎన్టీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. జక్కన్నతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. హ్యాపీ బర్త్ డే జక్కన్న అంటూ ట్వీట్ చేసాడు.


    తెలుగు తెరపై రాజమౌళి, ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వీళ్లిద్దరు దాదాపు ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేసారు. ఎన్టీఆర్ హీరోగా రెండో సినిమా ‘స్టూడెంట్ నెం. 1’తో రాజమౌళి దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్డాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘సింహాద్రి’ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత ముచ్చటగా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘యమదొంగ’లో యంగ్ యమగా ఎన్టీఆర్‌‌ను సరికొత్తగా చూపించడంతో పాటు స్లిమ్ అయ్యేలా చేసి.. తారక్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను చేరువయ్యేలా చేయడంలో రాజమౌళి పాత్ర ఎంతైనా ఉంది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్‌లోని యాక్టింగ్ టాలెంట్‌ను ఏంటో ప్రేక్షకులకు తెలియజేసాడు. ఇపుడు నాల్గోసారి తారక్‌తో ‘ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం’ టైటిల్‌తో కాల్పనిక చారిత్రక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తెలంగాణ గొండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెల 22న కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.ఇక ఎన్టీఆర్ కూడా తన కెరీర్‌లో ఓ దర్శకుడితో నాల్గో సినిమా చేయడం ఇదే మొదటిసారి. అది కూడా తనకు ఫస్ట్ సక్సెస్ అందించిన రాజమౌళితో చేయడం విశేషం.
















    మరోవైపు రాజమౌళికి ఆర్ఆర్ఆర్ టీమ్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే  విషెస్ తెలియజేసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు