మరోసారి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా.. ఆర్ఆర్ఆర్ తర్వాత అదిరిపోయే కాంబినేషన్‌లో..

ఎన్టీఆర్ తన ఇన్నేళ్లు కెరీర్‌లో తొలిసారి తమ కుటుంబానికి చెందిన అన్న కళ్యాణ్ రామ్ ఓన్ బ్యానర్‌ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ‘జై లవకుశ’ సినిమా చేసాడు. ఇపుడు మరో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 14, 2020, 5:25 PM IST
మరోసారి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా.. ఆర్ఆర్ఆర్ తర్వాత అదిరిపోయే కాంబినేషన్‌లో..
కళ్యాణ్ రామ్‌తో జూ ఎన్టీఆర్ (Twitter/Photo)
  • Share this:
ఎన్టీఆర్ తన ఇన్నేళ్లు కెరీర్‌లో తొలిసారి తమ కుటుంబానికి చెందిన అన్న కళ్యాణ్ రామ్ ఓన్ బ్యానర్‌ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ‘జై లవకుశ’ సినిమా చేసాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్.. అన్న కళ్యాణ్ రామ్ నుంచి ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదనే టాక్ వినబడింది. ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ కేవలం నిర్మాతగా నష్టపోయిన అన్న కళ్యాణ్ రామ్‌ను ఒడ్డున పడేయడానికే చేసినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. ఇపుడు మరోసారి అన్న కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ మరో సినిమా చేయబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తారక్..  రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జూనియర్ దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ వచ్చే ఫిబ్రవరికి కంప్లీట్ కానుంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఆల్రెడీ ఈ సంక్రాంతికి అల్లు అర్జున్‌తో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి హిట్టే అందుకున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు.. ఎన్టీఆర్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు సమాచారం.

jr ntr and kalyan ram team up again after jai lavakusha movie with trivikram movie,jr ntr kalyan ram,jr ntr kalyan ram photos,entha manchivaadavuraa,entha manchivaadavuraa movie review,jt ntr kalyan ram trivikram movie,jai lavakusha jr ntr kalyan ram trivikram,jr ntr twitter,kalyan ram 118 movie review,jr ntr rrr movie shooting,kalyan ram movies,jr ntr suggestions to kalyan ram,kalyan ram ntr arts banner movies, telugu cinema,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,jr ntr koratala siva movie,jr ntr trivikram,జూనియర్ ఎన్టీఆర్,ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్,కళ్యాణ్ రామ్‌ను సినిమాలు నిర్మించవద్దన్న జూనియర్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,ఎంత మంచివాడవురా,ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ
అన్న కళ్యాణ్ రామ్‌తో జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)


ఇప్పటికే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గ కథ వినిపించడాడట. దానికి తారక్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.ఇప్పటికే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాను త్రివిక్రమ్ హారిని అండ్ హాసిని  క్రియేషన్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌లో అన్నయ్య కళ్యాణ్ రామ్‌ను నిర్మాతగా ఇన్వాల్వ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుకంగా తెరకెక్కించాయి. అదే రీతిలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌ తో పాటు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.త్వరలో ఈ ప్రాజెక్ట్ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 14, 2020, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading