ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..

నందమూరి తారకరామారావు 24వ వర్థంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ చేరుకొని నివాళులు అర్పించారు.

news18-telugu
Updated: January 18, 2020, 11:37 AM IST
ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..
Twitter
  • Share this:
నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 24వ వర్థంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ చేరుకొని నివాళులు అర్పించారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలను ఉంచి అన్న తమ్ములు తారక్, కళ్యాణ్ రామ్ తాత ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి, కొన్ని నిముషాలు మౌనం పాటించారు. అనంతరం కాసేపు అక్కడ గడిపారు. ఇక, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు కూడా నివాళులు అర్పించారు. కాసేపు ఘాట్‌లోనే కూర్చొన్నారు. మరోవైపు ఇటు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తెలుగు వెండితెర వేలుపుగా, ప్రజల ఆరాధ్య నాయకుడిగా ఎదిగిన ఎన్టీఆర్ 1996 జనవరి 18న హఠాన్మరణం పొందారు. అది అలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విరామంలో ఉన్నారు. ఈనెల 20 నుండి మొదలుకానున్న లేటెస్ట్ షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా మరో స్టార్ హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు