Jr NTR: రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత తారక్.. ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేయనున్నాడా అంటే.. అవుననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద మల్టీస్టారర్‌గా ఈ సినిమా రానుంది. ఆ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా ఎన్టీఆర్, విజయ్ వంటి ఊర మాస్ హీరోలు కలిసి నటిస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అయిందా.. రూమర్‌గా ఉండబోతుందా అనేది చూడాలి. మొత్తంగా ఎన్టీఆర్ కూడా కథ నచ్చితే.. వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Atlee, Jr ntr, Kollywood, Koratala siva, RRR, Tollywood, Vijay