Ananya Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జర్నీ ఫేమ్ అనన్య...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జర్నీ ఫేమ్ అనన్య (Whatsup/Photo)

Ananya Tirumala | తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.  ప్రముఖ నటి  ‘జ‌ర్నీ’ సినిమా ఫేమ్ అన‌న్య మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

  • Share this:
    Ananya Tirumala | తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.  ప్రముఖ నటి  ‘జ‌ర్నీ’ సినిమా ఫేమ్ అన‌న్య మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. అంతేకాదు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని ప్రతి యేట దర్శించుకుంటానని చెప్పారు. అనన్య విషయానికొస్తే.. బాలనటిగా మలయాళ చిత్ర రంగంలోకి ప్రవేశంచిన ఈమె.. తమిళంలో విడుదలైన సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘నానొడిగల్’ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత రహస్య పోలీస్, శిక్కర్’ సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత తమిళంలో రిలీజైన ‘ఎంగేయమ్ ఎంపొత్తమ్’ సినిమా ఈమకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘జర్నీ’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్టైంది. తెలుగులో కూడా ఆమె త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’లో నితిన్ చెల్లెలి పాత్రలో నటించింది. మరోవైపు గతేడాది మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ ప్రేమికురాలి పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: