• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JISSHU SENGUPTA TO BE SEEN IN A KEY ROLE FOR NANI SHYAM SINGHA ROY SR

Nani Shyam Singha Roy : నాని పిరియాడిక్ డ్రామాలో టాలెంటెడ్ బెంగాళీ నటుడు..

Nani Shyam Singha Roy : నాని పిరియాడిక్ డ్రామాలో టాలెంటెడ్ బెంగాళీ నటుడు..

నాని శ్యామ్ సింగ రాయ్ (Nani Shyam Singha Roy)

Nani Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా మూడు సినిమాలు వస్తున్నాయి.

  • Share this:
    నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా మూడు సినిమాలు వస్తున్నాయి. తన హిట్ దర్శకుడు శివ నిర్వాణతో తెరక్కించిన “టక్ జగదీష్” కాగా మరొకటి దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో చేస్తున్న “శ్యామ్ సింగ రాయ్”. రాహుల్ సంకృత్యన్ గతంలో విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వచ్చిన టాక్సీవాలా అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి నాని లుక్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఆ లుక్‌లో నాని విజయ గౌర్వంతో ఉన్నట్లుగా ఆయన వెనుక దాక్కోని హీరోయిన్‌ను చూపించారు. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్స్ సాయి పల్లవి, కృతి శెట్టిలు నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమాలోకి మరో టాలెంటెడ్ నటుడు వచ్చినట్టుగా తెలిపింది చిత్రబృదం. అతడే బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా. తెలుగులో తాను చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ మరియు ఇంప్రెస్ ను తెచ్చుకోగలిగాడు. గతంలో జిష్షు సేన్ గుప్తా నితిన్ భీష్మా, నాగ శౌర్య అశ్వాద్థామ సినిమాల్లో కనిపించాడు. ఇక తాజాగా నాని సినిమాతో పాటు చిరంజీవి ఆచార్యలో కూడా జిష్షు సేన్ గుప్తా కనిపించనున్నాడని తెలుస్తోంది.

    ఇక నాని శ్యామ్ సింగరాయ్ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక నాని గత సినిమాల విషయానికి వస్తే.. ఆమధ్య వి అనే యాక్షన్ థ్రిల్లర్‌తో వచ్చి పరవాలేదనిపించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘V’ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. ఓటీటీలో విడుదలవ్వడంతో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమాలో నాని నటనకు మంచి మార్కులే పడ్డ.. రొటీన్ రివేంజ్ స్టోరీ అంటూ కామెంట్స్ వినపడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోగా సుధీర్ బాబు నటించాడు. నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నాడు. మొదటి నుంచీ మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్ ను చూస్తే మాత్రం ఓ క్లాస్ అండ్ పవర్ ప్యాక్డ్ గా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


    నాని ఈ మూవీతో పాటు 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఇటీవల ప్రీలుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు