Home /News /movies /

ప్రముఖ టిక్ టాక్ స్టార్ హత్య.. పరారీలో హంతకుడు..

ప్రముఖ టిక్ టాక్ స్టార్ హత్య.. పరారీలో హంతకుడు..

టిక్ టాక్ స్టార్ శివానీ

టిక్ టాక్ స్టార్ శివానీ

టీవీల్లో క్రైమ్ వార్తలు చూసి ప్రేరణ పొందిన ఓ హర్యానా వాసి (సోనిపట్) ప్రముఖ టిక్‌టాక్ స్టార్‌ను హత్య చేసాడు.

    టీవీల్లో క్రైమ్ వార్తలు చూసి ప్రేరణ పొందిన ఓ హర్యానా వాసి (సోనిపట్) ప్రముఖ టిక్‌టాక్ స్టార్‌ను హత్య చేసాడు. వివరాల్లోకి వెళితే.. సోనిపట్‌లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న శివానీ ఖుబియాన్‌ను టిక్‌టాక్‌లో 1 లక్ష మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె ఆ చుట్టు పక్కల గ్రామాల్లో తన వీడియోలతో చాలా పాపులర్‌గా మారింది. అయితే తన పొరుగింట్లో ఉంటున్న ఆరీఫ్ కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. శివానీకి ఇది ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఆమె ఆరీఫ్ ప్రేమను నిరాకరించింది. నాప్రేమను కాదంటావా.. అని కోపంలో శివానీని హత్య చేసాడు ఆరీఫ్.  శివానీ మూడు రోజుల కింద జూన్ 26 న హత్యకు గురైనప్పటికీ ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. శివానీ పనిచేస్తోన్న బ్యూటీ పార్లర్‌ నుండి వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.

    ఈ హత్య గురించి శివానీ తండ్రి మాట్లాడుతూ.., ఆరిఫ్ గత మూడేళ్ళ నుండి శివానీని ప్రేమించమని వేధిస్తున్నాడని.. అతని వేధింపులు తట్టుకోలేక తన కుటుంబాన్ని అక్కడి నుండి వేరే చోటకు మార్చామని అయినా కూడా శివానీ వెంటపడేవాడని తెలిపాడు. శివానీ తండ్రి ఫిర్యాదు మేరకు ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ శివానీని హత్య చేసిన ఆరీఫ్ పరారీలో ఉన్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. ఆమె మృతదేహాన్ని కనుగొనటానికి ఏడు గంటల ముందు ఆమె టిక్‌టాక్‌ అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేయబడిందని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఫోన్ నుండి మెసేజ్‌లు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా శివానీ బతికే ఉందనే భ్రమను ఆరీఫ్ కలింగించి కేసును తప్పుదోవా పట్టించాలనీ చూశాడని పోలీసులు తెలిపారు.
    First published:

    Tags: Crime news, Tik tok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు