హోమ్ /వార్తలు /సినిమా /

Jhanvi Kapoor: అతిలోక సుంద‌రి వెర్ష‌న్ 2.0... చీర లుక్ అద్దిరిపోయిందిగా!

Jhanvi Kapoor: అతిలోక సుంద‌రి వెర్ష‌న్ 2.0... చీర లుక్ అద్దిరిపోయిందిగా!

Jhanvi Kapoor looks dazzling in a saree

Jhanvi Kapoor looks dazzling in a saree

Jhanvi Kapoor- Saree look: అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెల్లచీర కట్టుకున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది

అతిలోక సుంద‌రి అతిలోక సుంద‌రి అనే పాట విన‌గానే ఈ త‌రం వారికి ర‌కుల్ ప్రీత్‌సింగ్ హార్ట్ లో 70 ఎంఎం స్క్రీన్ మీద క‌నిపిస్తే క‌నిపించ‌వ‌చ్చేమోగానీ.... కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే .... ఎల్లువొచ్చి గోదార‌మ్మా ఎల్ల‌కిలా ప‌డ్డాద‌మ్మో... అన్న‌ట్టుగా అంద‌రికీ ఒక‌రి బొమ్మే బంప‌ర్‌గా గుండెల్లో ఢంకా మోగిస్తుంది. ఆమె ఎవ‌రో కాదు... అతిలో క సుంద‌రి శ్రీదేవి. కానిరాని లోకాల‌కు శ్రీదేవి వెళ్లార‌న్న వార్త‌ను ఇంకా న‌మ్మ‌లేక‌పోతున్న ఎన్నో హృద‌యాల‌కు ఇప్పుడు కాసింత ఊర‌ట ఆమె త‌న‌య జాన్వి. అమ్మ లేని లోటును ఆమె ఫ్యాన్స్ కి తెలియ‌నివ్వ‌కూడ‌ద‌ని అనుకుంటుందో ఏమో గానీ, అప్పుడ‌ప్పుడూ జాన్వి చీర‌ల్లో మెరిసిపోతుంది. ఆమెను చీర‌లో చూసిన ప్ర‌తిసారీ నెటిజ‌న్లు అతిలోక సుంద‌రి వెర్ష‌న్ 2.0 అని స‌ర‌దాగా కామెంట్లు కూడా చేస్తుంటారు.

లేటెస్ట్ గా అలా... అంత‌క‌న్నా చిలిపిగా కామెంట్ చేయ‌డానికి త‌గ్గ‌ట్టు ఓ ఫొటో పోస్ట్ చేశారు జాన్వి. అస‌లే అతిలోక సుంద‌రి త‌న‌య‌... ఆపై తెల్ల‌టి చీర‌క‌ట్టు... దాని అంచు మీద ఎంబ్రాయిడ‌రీ. ధ‌రేమో ల‌క్ష‌కు పైగానే..! ఆ చీర‌లో హుందాగా, అందంగా క‌నిపిస్తున్నారు జాన్వి. ప్రిస్టిన్ వైట్ శారీకి మ‌ల్టీ క‌ల‌ర్డ్ ఫ్లోర‌ల్ థ్రెడ్ ఎంబ్రాయిడ‌రీ చేసిన తీరు, అందులోనూ బీడ్స్, స్టోన్స్ ని పొదిగిన వైనం చూసే వారంద‌రినీ ఇట్టే అట్రాక్ట్ చేస్తోంది. అబ్బాయిలు జాన్విని చూస్తుంటే, అమ్మాయిలు మాత్రం ఆమె స్టైలింగ్‌, శారీ వేరింగ్ మీద ఫోక‌స్ చేస్తున్నారు. ఎవ‌రు జాన్విని ఎలా చూసినా... చివ‌రాఖ‌రిగా క‌చ్చితంగా అడుగుతున్న‌ది మాత్రం ఆ ఒక్క మాటే...! తెలుగులో ఎంట్రీ ఎప్పుడు?

ఇదిగో అదిగో అంటూ ఆమె తండ్రి బోనీక‌పూర్ చాలా సార్లు చెబుతూనే ఉన్నారు. ప‌ర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న జాన్వికి బెస్ట్ ఎంట్రీ దొరుకుతుంద‌నే గ్యారంటీగా చెబుతున్నారు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న శివ నిర్వాణ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌న్న‌ది లేటెస్ట్ హాట్ హాట్ ఖ‌బ‌ర్‌.

First published:

Tags: Bollywood, Boney Kapoor, Janhvi Kapoor, Sridevi, Vijay Devarakonda

ఉత్తమ కథలు